ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎంతయినా ఇంజనీర్లు కదా.. మారుతీ కారు టాప్‌ను తీసేసి.. దాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-07-21T11:07:39+05:30

టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల ఆలోచనా తీరు కూడా మారుతూ వస్తోంది. చిన్నతనంలో బంకమన్నుతో బొమ్మలు తయారుచేసుకుని సంతోషపడే కాలం నుండి మనిషి చాలా ఎదిగిపోయాడు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఓపెన్ చేస్తే చాలు. బోలెడు వింతలు విశేషాలు కనబడతాయి. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా మనిషి ట్యాలెంట్ అన్నిటికంటే పెద్ద ఎంటర్టైన్మెంట్. ఓ ఇంజనీర్ క్రియోటీవిటీ ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. కారు టాప్ తీసేసి అతను చేసిన ఆవిష్కరణ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిగురించి పూర్తీగా తెలుసుకుంటే..

టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల ఆలోచనా తీరు కూడా మారుతూ వస్తోంది. చిన్నతనంలో బంకమన్నుతో బొమ్మలు తయారుచేసుకుని సంతోషపడే కాలం కాదిది. రిమోట్ కార్ ను పార్ట్స్ గా విడదీసి దాని పనితీరు గమనించే పిడుగుల ప్రపంచం ఇది. ఇక పెద్దయ్యాక ఆ టాలెంట్ అలాగే ఉండిపోదు కదా.. క్రియోటీవిటీ రూపంలో బయటికొస్తుంది. ఆవిష్కరణల ప్రపంచంలో ఉండే ఇంజనీర్లకు ఇలాంటి వాటి గురించి రెండాకులెక్కువే తెలిసి ఉంటుంది. ఫరీదాబాద్ కు చెందిన ఓ ఇంజనీర్(faridabad engineer) అదే పని చేశాడు. అతను తన 'మారుతీ 800(Maruti 800)'కారును మరింత వినూత్నంగా ఆవిష్కరించాడు. కారు పై కప్పు భాగాన్ని తొలగించాడు(top removed of maruti 800). దీంతో అది టాప్ లెస్ కారుగా మారిపోయింది. ముందు భాగంలో మిర్రర్ మాత్రమే ఉంది. కారు సైడ్ విండోలు కూడా తొలగించేయడంతో కారు డోర్స్ కూడా షార్ట్ గా మారిపోయాయి. సింపుల్ గా చెప్పాలంటే పాతకాలంలో ఉపయోగించిన ఫ్యాషన్ కారులా రూపాంతరం సంతరించుకుంది. చూడటానికి చాలా అట్రాక్షన్ గానూ ఉంది. వీడియోలో ఈ కారును దాని యజమాని రహదారి మీద నడుపుతూ వెళ్ళడం చూడొచ్చు. కారు రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ టర్న్ తీసుకుంటుంది. టాప్ తీసేయం వల్ల ఈ మారుతీ800 కారును మారుతీ 400 అని పిలుస్తున్నారు చాలామంది. హర్యానా(Haryana) రాష్ట్రం ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తి దీన్ని ఆవిష్కరించినట్టు వీడియో మీద ఉన్న క్యాప్షన్ ద్వారా అర్థమవుతోంది.

Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!


ఈ వీడియోను adwaitxpilania అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'మారుతున్న వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళుతున్నట్టు అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది?' అని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియోకు చాలా సరదాగా కామెంట్ చేస్తున్నారు. 'అతని లిమిట్స్ ఏవీ అతన్ని అతను కన్న కలల నుండి వేరు చేయలేవు' అని ఒకరు కామెంట్ చేశారు. 'కంగ్రాట్స్ మహేష్ దొరికాడు' అని మరొకరు ఫన్నీగా సెటైర్ వేశారు. 'ఏం క్రియోటీవిటీ బాస్ నువ్వు సూపర్' అని దాన్ని ఆవిష్కరించిన వ్యక్తిని పొగుడుతున్నారు మరికొందరు.

Updated Date - 2023-07-21T11:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising