ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇతని గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయంలో ఉన్న శునకాన్ని ఎలా కాపాడాడంటే..

ABN, First Publish Date - 2023-05-29T15:41:47+05:30

ఆ శునకం ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రమాదంలోకి జారుకుంది. అప్పుడే అటుగా వెళుతున్న ఓ వ్యక్తి కుక్కను చూసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదాలు చెప్పి రావు. కొన్ని సార్లు ఆ ప్రమాదాలు ప్రాణాల మీదకు తెస్తాయి. ఓ మహిళ తన పెంపుడు శునకంతో కలసి బయటకు వెళ్ళింది. ఆమె పక్కనే నడుస్తున్న శునకం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటివరకు తుళ్ళుతూ, అరుస్తూ తన వెంట వచ్చిన కుక్కకు ఏమయ్యిందో ఆమెకు అర్థం కాలేదు. ఉలుకు పలుకు లేకుండా మరణావస్థలో ఉన్న కుక్కను చూసి ఆమె విలవిల్లాడిపోయింది. అప్పుడే ఓ వ్యక్తి అటుగా వెళుతూ కుక్క పరిస్థితి తెలుసుకున్నాడు. దేవుడిలా కుక్క ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హార్డ్ ప్రాబ్లమ్స్(Heart problems) ఎక్కువయ్యాయి. ఆడుతూ పాడుతూనో.. పనులు చేస్తూనో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారిని చూస్తున్నాం. అయితే తన యజమానితో కలసి బయటకు వెళ్ళిన ఓ శునకానికి విచిత్రంగా హార్డ్ అటాక్(Dog has heart attack) వచ్చింది. యజమాని ప్రక్కన నడుస్తున్నదల్లా ఉన్నట్టుండి పుట్ పాత్ మీదనే కూలిపోయింది. కుక్కకు ఏమయ్యిందో తెలియక యజమాని బాధపడుతోంటే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పరిస్థితి తెలుసుకున్నాడు. వీడియోలో ఓ వ్యక్తి కుక్కకు సీపీఆర్(man make CPR for dog) చేయడం చూడొచ్చు. అతను ఏ మాత్రం సంకోచించకుండా కుక్క నోట్లో తన నోరు పెట్టి కుక్కకు శ్వాస అందించాడు. ఆ తరువాత కుక్క ఛాతీ భాగంతో ఒత్తుతూ సీపీఆర్(CPR) చేస్తాడు. అతను ఎంత చేసినా కుక్క మొదట లేవలేదు. కానీ అతను తన ప్రయత్నాన్ని వదలకుండా కొనసాగించడంతో కుక్క మెల్లగా స్పృహలోకి వచ్చి తోక ఊపుతుంది. ఆ తరువాత అతను కుక్కను మెల్లిగా బుజ్జగించి దాన్ని ఓదారుస్తాడు. నిమిషం తరువాత కుక్క పూర్తీగా కోలుకుని పైకి లేస్తుంది. అది సంతోషంతో గంతులేస్తుంది. కుక్క కోలుకోవడం చూసి అక్కడివారు అందరూ చాలా సంతోషిస్తారు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి కి చూపించే కృతజ్ఞత మాటల్లో చెప్పలేనిది. తరువాత కుక్క యజమాని కూడా కుక్కను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతుంది.

Health Tips: తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్లు వాడుతున్నారా? ఇలా చేశారంటే నిమిషాల్లో తగ్గిపోవడం ఖాయం..


ఈ వీడియోను ELON MUSK= COMEMIERDA అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కను కాపాడిన వ్యక్తిని కొనియాడుతున్నారు. 'అతను నిజంగా దేవుడే.. సరైన సమయంలో సీపీఆర్ ద్వారా కుక్కను కాపాడాడు' అని అంటున్నారు. 'ఈ వీడియో చూశాక నాకు కళ్ళలో నీళ్లొచ్చాయి. కుక్కే కదా అని దాన్నలా వదిలేయకుండా కాపాడి చాలామంచి పని చేశారు' అంటున్నారు.

Bride: పెళ్ళైన రెండోరోజే నాభార్య నగలతో సహా పారిపోయిందని పోలిస్ స్టేషన్లో వరుడి ఫిర్యాదు.. అసలు నిజం బయటపడటంతో..


Updated Date - 2023-05-29T17:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising