ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డు పక్కన టీ అమ్ముతున్న రజనీకాంత్.. ఇదేమైనా కొత్త సినిమా షూటింగేమో అనుకున్నారంతా.. కానీ అసలు సంగతి తెలిసి..

ABN, First Publish Date - 2023-10-24T11:42:10+05:30

'ఆయనేంటి టీ అమ్ముతున్నారు ఏదైనా షూటింగ్ జరుగుతోందా?' అని నెటిజన్లు, ఆయన అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అసలు నిజమేంటంటే..

రజనీకాంత్.. ఈ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించి ఉంది. విదేశాలలో కూడా ఈయనకు పిచ్చ అభిమానులు ఉన్నారు. నటనతోనూ, స్టైల్ తోనూ అందరినీ ఫిదా చేసే రజనీకాంత్ చాలా సింపుల్ లైఫ్ గడుపుతారని సాధారణ సమయాల్లో ఆయన్ను చూసినవారికి ఇట్టే అర్థమవుతుంది. అయితే రోడ్డు పక్కన ఓ టీ కొట్టులో రజనీకాంత్ టీ అమ్ముతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఆయనేంటి టీ అమ్ముతున్నారు ఏదైనా షూటింగ్ జరుగుతోందా?' అని నెటిజన్లు, ఆయన అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు నిజం తెలిసిన తరువాత విస్తుపోతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కేరళ(Kerala) రాష్ట్రం కొచ్చిలో(Kochi) సూపర్ స్టార్ రజనీకాంత్ టీ అమ్ముతుండటం(Superstar Rajinikanth selling tea) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి రహదారి పక్కన నిలబడుకున్నాడు. నీలం రంగు చొక్కా, షార్ట్ లో నిలబడుకున్న అతను ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఆ తలకట్టు, రూపం అచ్చం రజనీ సర్ లాగే ఉండటంతో ఆయన్ను చూసినవారు షాకవుతున్నారు. అతను ఎవరితోనో మాట్లాడుతూ జుట్టును రెండుచేతులతో అలా సవరించడం, తరువాత కరచాలనం చేయడం భలే సరదాగా ఉంది. ఇదేమైనా కొత్త సినిమా షూటింగ్ లో భాగమేమో అనుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే అతను రజనీ సర్ కాదు, అచ్చం ఆయనలాగే ఉన్న మరొక వ్యక్తి. సడన్ గా చూసి రజనీకాంత్ అనుకోని వ్యక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంత దగ్గరి పోలికలు ఉన్నాయి రజనీకాంత్ గారికి, ఇతనికి. ఇతను కొచ్చిలో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట. ఈయన పేరైతే తెలియదు కానీ రజనీ రూపం కారణంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు.

Read also: White Hair: తెల్లజుట్టు కవర్ చేయడానికి పదే పదే హెన్నా పెట్టినా పెద్దగా ఫలితం లేదా? ఒక్కసారి హెన్నాలో ఇది కలిపి వాడితే..


ఈ వీడియోను DESPOTER అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అతను రజనీకాంత్ కాదనే విషయాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు. స్వయానా రజనీకాంతే అలా రహదారి మీద మాట్లాడుతున్నాజని అపోహ పడుతున్నారు. 'ఆయన అసలు రజనీకాంత్ కాదు, కొచ్చిన్ లో స్థానికంగా టీ అమ్మే వ్యక్తి' అని ఒకరన్నారు. 'రజనీకాంత్ చాలా సింపుల్ లైఫ్ గడుపుతారని అంటారు, అది ఇదేనేమో' అని కొందరు ఆయన్ను రజనీకాంత్ అనుకుని పొరబడ్డారు. 'వందకోట్ల పారితోషికం తీసుకునే హీరోకు ఈయనకు రూపంలో ఏమాత్రం తేడా లేదు, ఎంత విచిత్రం' అని మరొకరు కామెంట్ చేశారు.

Read also: Health Tips: ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని రెగ్యులర్ గా తింటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..

Updated Date - 2023-10-24T12:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising