ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నూడుల్స్‌ను తినే అలవాటు ఉందా..? ఒక్కసారి ఈ వీడియోను చూస్తే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో..!

ABN, First Publish Date - 2023-12-04T13:11:32+05:30

పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నూడిల్స్ అంటే ఇష్టమే.. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం షాకవుతారు.

ఎవరైనా బయటకు వెళ్తే ఎక్కువగా ఆసక్తి చూపించే ఆహారాల్లో నూడిల్స్ ముందు వరుసలో ఉంటాయి. పిల్లలు, పెద్దలు కూడా నూడిల్స్ తినడానికి ఇష్టపడతారు. నూడిల్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సరే.. వాటి రుచి కారణంగా వాటికే ఓటేస్తారు. అయితే నూడిల్స్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక నూడిల్స్ అంటే ఇష్టపడేవాళ్లు కాస్త ఆలోచిస్తారేమో.. నెటిజన్లను షాకింగ్ కు గురిచేస్తున్న ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా అమ్ముడుపోయే ఆహారాలలో నూడిల్స్ కూడా ఒకటి. చైనా నుండి పరిచయం అయిన ఈ నూడిల్స్ అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. మ్యాగీ, యప్పీ వంటి బ్రాండెడ్ కాకుండా, కాస్త మందంగా ఉన్న నూడిల్స్ తయారుచేసి అమ్ముతుంటారు. వీటిని చౌ మెన్ నూడిల్స్ అని అంటారు. వీటిలో రసాయనాలు తక్కువ ఉంటాయని కూడా అంటారు. కానీ నూడిల్స్ తయారుచేయడంలో ఓ వ్యక్తి హస్తవాటం మామూలుగా లేదు. వీడియోలో నది ఒడ్డున కొందరు ఉండటం గమనించవచ్చు. ఓ వ్యక్తి నదిలో దిగి తన చేతిలో ఓ ప్లాస్టిక్ బుట్టను పట్టుకుని దాన్ని నీళ్లలో ముంచుతున్నాడు. ఆ బుట్టలో ఏమున్నాయో మొదట అర్థం కాదు. కానీ అతను బుట్టను నీళ్లలో ఒకటికి మూడుసార్లు బాగా ముంచిన తరువాత బయటకు తీసుకొచ్చేటప్పుడు గమనిస్తే బుట్ట రంధ్రాలలో నుండి ఉడికించిన నూడిల్స్ బయటకు కనిపిస్తాయి(man dipped noodles in river water). బహుశా అతను నూడిల్స్ ను ఉడికించిన తరువాత వాటిని చల్లనీళ్లలో వేయడం ద్వారా అతుక్కుపోకుండా చేయాలనే ఉద్దేశంతో అలా చేసినట్టు అర్థమవుతోంది. చుట్టుప్రక్కల అంత మంది ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడం మరింత షాక్ కు గురిచేస్తోంది. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: స్కూలు నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని అడగాల్సిన ప్రశ్నలివీ..!


ఈ వీడియోను ___mr.mishra_je___ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఈ వీడియో చూసిన తరువాత నూడిల్స్ తినండి' అని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ వ్యక్తి నూడిల్స్ ను గంగార్పణం చేస్తున్నాడు' అని ఒకరు సెటైర్ వేశారు. 'వీధి వ్యాపారులు ఆహారం తయారీలో చాలా అపరిశుభ్రంగా ఉంటున్నారు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్చంగా ఉంటుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: Women Health: ఆడవాళ్లు బలంగా ఉండాలంటే ఏం తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆహార రహస్యాలివీ..


Updated Date - 2023-12-04T13:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising