ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?

ABN, First Publish Date - 2023-06-26T13:30:13+05:30

ట్రాఫిక్ అధికారులు చలానా కట్టి కారును తీసుకెళ్ళమంటే అతనిలో అహంకారం తలవంచనివ్వలేదు. చివరకు ఇలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ప్రపంచంలో డబ్బు చాలా శక్తివంతమైన ఆయుధం. ఎవ్వరూ తమ చేతి నుండి డబ్బు చేజార్చుకోవాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు చేసే తప్పిదాల కారణంగా డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో ట్రాఫిక్ అధికారులు అతని కారును స్వాధీనం చేసుకున్నారు.' ట్రాఫిక్ చలానా కట్టి కారును తీసుకెళ్ళు' అంటూ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అతనిలో ఉన్న అహంకారం అతన్ని తలవంచనివ్వలేదు. ట్రాఫిక్ చలానా కట్టకుండా ఆ కారు యజమాని చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. దీని సంబంధించిన వీడియో సోషలా్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

తప్పులు చేస్తే ఏదో ఒకరకమైన నష్టం తప్పకుండా జరుగుతుంది. ఇక చట్టపరమైన రూల్స్ ఉల్లంఘిస్తే చాలా వరకు ఆర్థిక నష్టం(financial loss) తప్పదు. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడు(man break traffic rules). దీంతో ట్రాఫిక్ అధికారులు అతని కారును స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చలానా(traffic fine) కట్టి కారును తీసుకుకెళ్ళమని అతనికి చెప్పి కారును ఓ ట్రక్కులో ఎక్కించారు. అయితే ఆ కారు యజమాని ట్రాఫిక్ చలానా కట్టడానికి ఇష్టపడలేదు. అతను వెంటనే తన స్నేహితుడికి కాల్ చేసి అక్కడికి పిలిపించాడు. ట్రాఫిక్ అధికారులు తన కారును ట్రక్(truck) లో పోలిస్ స్టేషన్ కు తీసుకెళుతోంటే ఆ ట్రక్కును ఫాలో అయ్యాడు. ఆ ట్రక్కు హైవే మీదకు వెళ్ళాకా కారును ట్రక్కు దగ్గరగా పోనిచ్చారు. ఈ క్రమంలో అతను తన ఫ్రెండ్ కారు విండోలో నుండి ట్రక్కుమీదకు చేరుకున్నాడు. తన దగ్గర ఉన్న కారు కీస్ సహాయంతో ట్రక్కులో ఉన్న కారును స్టార్ట్ చేశాడు. కదులుతున్న ట్రక్కునుండి కారును రహదారి మీదకు దూకించాడు(man jumped with car from moving Truck). అతనలా కారును తీసుకెళ్ళిపోవడం ట్రక్కు నడుపుతున్న వ్యక్తికి కూడా తెలియదు. జరిగిన మొత్తాన్ని వీడియో తీయడంతో ఈ సంఘటన బయటకువచ్చింది. కారు స్టార్ట్ చేసి ట్రక్కునుండి రహదారి మీదకు దూకించాక కారు ఫ్రంట్ లైట్స్ వెలగడం వీడియోలో చూడచ్చు.ఈ సంఘటన అమెరికాలో జరిగినట్టుగా తెలుస్తోంది.

Health tips: పిల్లలు పుట్టడం లేదని బెంగా? పడుకునేముందు పాలలో ఇదొక్కటి కలిపి తాగితే చాలు.. అద్బుతమైన ఫలితాలుంటాయి!


ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను చేసిన పనికి మండిపడుతున్నారు. 'డబ్బు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యమా?' అని సదరు వ్యక్తిమీద ఫైర్ అవుతున్నారు. 'ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే, ఆ తరువాత మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని అంటున్నారు. 'అతను తనను తాను టామ్ క్రూజ్ అనుకుంటున్నాడు అందుకే అంత స్టంట్ చేశాడు' అని ఒకరు సెటైర్ వేశారు. 'ట్రక్ డ్రైవర్ సైడ్ మిర్రర్ లోనుండి ఎందుకు ఇదంతా గమనించలేదు?' అని సందేహం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.

Updated Date - 2023-06-26T13:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising