ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కంటతడి పెట్టిస్తున్న వీడియో.. నెల రోజుల తర్వాత కనిపించిన ఆరిఫ్.. జూలో ఉన్న కొంగ రియాక్షన్ ఇదీ..!

ABN, First Publish Date - 2023-04-12T17:07:32+05:30

నెలరోజుల తరువాత ఆరిఫ్ కొంగను చూడడానికి వెళ్ళగా ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకునేవారు కొందరే ఉంటారు. మనుషుల్లో ఇలాంటి గుణాన్ని వెతకడం వ్యర్తమేమో కానీ జంతువులు, పక్షులలో కృతజ్ఞతా భావం చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు సహాయం చేసిన వ్యక్తులను చక్కగా గుర్తుపెట్టుకుంటాయవి. ఓ కొంగ వల్ల ఇప్పుడు ఈ విషయం మరొక సారి రుజువైంది. ఆరిఫ్ అనే వ్యక్తి ప్రమాదంలో ఉన్న కొంగను కాపాడి దాన్ని కంటికిరెప్పలా చూసుకున్నాడు. దీంతో కొంగకు ఆరిఫ్ కు మధ్య స్నేహం చాలా గాఢంగా పెనవేసుకుపోయింది. బైక్ మీద ఆరిఫ్ వెళ్తుంటే కొంగ అతన్ని అనుసరిస్తున్న వీడియో ఈమధ్య వైరల్ అయ్యింది. అయితే ఈ కొంగను అటవీశాఖ అధికారులు(forest department officers) స్వాధీనం చేసుకుని జూ(zoo) కు తరలించారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఆరిఫ్ కొంగను చూడడానికి వెళ్ళగా ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అసలింతకూ జూ లో ఏం జరిగింది? తన ప్రాణాలను కాపాడిన ఆరిఫ్ ను చూసి ఆ కొంగ ఏం చేసింది? పూర్తీగా తెలుసుకుంటే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం అమేథీలో(Amethi) ఆరిఫ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గతేడాది అతనికి గాయపడి ప్రమాదావస్థలో ఉన్న కొంగ(crane) కనిపించింది. అతను కొంగను చూసి జాలిపడి దాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు. దానికి వైద్యం చేయించి బాగయ్యేవరకు కంటికిరెప్పలా చూసుకున్నాడు. ఈ క్రమంలో ఆరిఫ్ కు కొంగకు మధ్య స్నేహం గాఢంగా పెనవేసుకుపోయింది. కొంగ పూర్తీగా కోలుకున్న తరువాత ఆరిఫ్ దాన్ని పంట పొలాల దగ్గర వదిలిపెట్టాడు. అయితే అది ఆరిఫ్ బైక్ వెనుక ఎగురుకుంటూ తిరిగి అతన్ని చేరుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది కూడా. అయితే ఈ సంఘటన జరిగిన నెలరోజుల తరువాత అటవీశాఖా అధికారులు ఆరిఫ్ ఇంటికి వెళ్ళారు. కొంగను స్వాధీనం చేసుకుని కాన్పూర్ జంతుప్రదర్శన శాలకు(Kanpur Zoo) తరలించారు. దీంతో హాయిగా ఉన్న వీరి స్నేహం విషాదంగా మారింది. సరిగ్గా నెలకిందటే కొంగ ఆరిఫ్ కు దూరమైంది. పదే పదే కొంగ గుర్తువస్తుండటంతో ఆరిప్ కొంగను చూడటానికి జూ కు వెళ్ళాడు.

AC: ఏసీ ఆన్ చేయగానే కొందరికి ఎందుకిలా జరుగుతుంది..? చాలా మందికి తెలియని నిజాలివి..!


జూలో కొంగను ఎన్క్లోజర్ ఏరియాలో బంధించారు. కొంగ ఎగిరిపోకుండా కంచె వేశారు. ఆరిఫ్ కొంగ దగ్గరకు వెళ్ళగానే కొంగ ఆరిఫ్ ను గర్తుపట్టింది. సంతోషంతో రెక్కలు ఆర్పుతూ అటూ ఇటూ గంతులు వేసింది. కంచె అడ్డులేకపోయి ఉంటే అది ఆరిఫ్ దగ్గరకు ఎగిరి వెళ్ళేలాగే అనిపించింది. తల్లికోసం బిడ్డ ఎంత అల్లాడుతుందో అంత ఆరాటం కొంగలోనూ కనిపించింది. ఆరిప్ ను చేరుకోవాలని పాపం కొంగ పిచ్చిగా గెంతులు వేస్తుంటే ఆరిఫ్ కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. @kailashnathsp అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. 'ఆరిఫ్ కు కొంగకు మధ్య చాలా గొప్ప స్నేహం ఉంది వారిని అలా విడదీయం పాపం' అంటున్నారు. 'అటవీశాఖ అధికారులు చాలా క్రూరంగా ఉన్నారు, వారు ఇలా చేయడం సరికాదు' అని మరికొందరు అంటున్నారు. కాగా ఈ కొంగను జూ కు తరలించిన తరువాత అది సరిగా ఆహారం తీసుకోవడం లేదని ఆరిఫ్ మీద బెంగపెట్టుకుందని కొందరు అంటున్నారు. కానీ ఆరిప్ ఫోటో చూపిస్తే కొంగ ఆహారం తింటోందట. దూరమైన తల్లి పోటోను చూపించి బిడ్డకు అన్నం పెట్టినట్టుంది అంటున్నారు ఈ విషయం విన్న నెటిజన్లు.

Lips Care Tips: మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్‌లు కాదండోయ్.. రాత్రిపూట పడుకునేముందు పెదాలకు వీటిని రాసుకోండి చాలు..!


Updated Date - 2023-04-12T17:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising