Viral Video: ఇతడు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాడు.. వేరే ఎవరైనా అయితే గుండె ఆగి పైకి పోయేవాళ్ళే.. చెట్టుకింద కూర్చున్న వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే..
ABN, First Publish Date - 2023-07-30T12:15:04+05:30
పనులు చేసిన తరువాత సేదతీరడం చాలామందికి అలవాటు. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు కాస్త సమయం దొరికితే చాలు ఒళ్లు తెలియకుండా నిద్రపోతారు. ఒక వ్యక్తి కూడా అదే విధంగా కడుపారా భోజనం చేసి చెట్టుకింద నిద్రపోయాడు. కానీ ఆ తరువాత జరిగింది చూస్తే..
పనులు చేసిన తరువాత సేదతీరడం చాలామందికి అలవాటు. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు కాస్త సమయం దొరికితే చాలు ఒళ్లు తెలియకుండా నిద్రపోతారు. ఒక వ్యక్తి కూడా అదే విధంగా కడుపారా భోజనం చేసి కాస్త కునుకు తీద్దామని చెట్టుకింద ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. బుస్సుమని శబ్ధం రావడంతో అతను ఉన్నట్టుండి మేల్కొన్నాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకుని వణకిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా భయపడిపోతున్నారు. 'నీకెంత గుండె ధైర్యం నాయనా..' అని ఆ వ్యక్తిని పొగుడుతున్నారు. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
చాలామంది నిద్రపోవడానికి ఇబ్బంది పడతారు కానీ కష్టపడి పనిచేసేవారికి ఆ సమస్య ఉండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా హాయిగా నిద్రపోగలుగుతారు. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసి బాగా అలసిపోయాడు. అప్పటికే భోజనం సమయం కావడంతో అతను కడుపారా భోజనం చేసి కాసేపు నిద్రపోదామని దగ్గరలో ఉన్న చెట్టుకింద విశ్రమించాడు. క్షణాల్లోనే అతనికి ఘాడంగా నిద్రపట్టేసింది(Man sleeping under the tree). ఉన్నట్టుండి బుస్ అనే శబ్దం రావడంతో అతను నిద్రనుండి మేల్కొన్నాడు. ఆ శబ్దం ఎక్కడినుండి వస్తుందా అని గమనించగా అది అతని చొక్కాలో నుండే వస్తున్నట్టు తెలిసింది. సరిగ్గా గమనించగా అతని చొక్కా గుండీల మధ్య నుండి నాగుపాము తలబయటపెట్టి తొంగిచూస్తోంది(cobra in man shift). దీంతో అతను భయంతో వణికిపోయాడు. శరీరమంతా చెమటలు పట్టేశాయి. చుట్టు ప్రక్కల వారు అతని భయాన్ని గమనించి వాకబు చేయగా చావును అరచేతిలో పెట్టుకుని వారికి తన పరిస్థితి వివరించాడు. చుట్టు ప్రక్కల కొందరు అతని చొక్కా గుండీలు విప్పమని సలహా ఇచ్చారు. అతను గుండీలు విప్పడానికి ప్రయత్నం చేసినా భయం వల్ల అతను ఆ పని చేయలేకపోయాడు. కానీ అతని సహాయం చేయడానికి అక్కడున్నవారిలో ఒకరు అతని చొక్కా గుండీలు విప్పారు. పాము అతని చొక్కాలో చుట్టచుట్టుకుని కనిపించింది. అక్కడున్న వారి సలహా మేరకు అతను కాస్త ముందుకు వంగగానే పాము అతని చొక్కా నుండి కిందకు జారింది. అయినా దాని తల ఇంకా అతని చొక్కాలోనే ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత ఆ పాము అక్కడినుండి మెల్లగా పక్కకు వెళ్ళిపోయింది. పాము అలా వెళ్ళిపోగానే అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అతను ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు. కూర్చున్నచోటునుండి పైకి లేచి చొక్కా గుండీలు వేసుకున్నాడు.
Health Tips: వర్షాకాలంలో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే.. విటమిన్-డి లోపం రాకూడదంటే..
ఈ వీడియోను Hasna Zaroorti Hai అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. చాలామంది ఈ వీడియో చూసి భయపడిపోతున్నారు. 'బహుశా ఆరోజు యముడు సెలవులో ఉన్నట్టున్నాడు. అందుకే అతను బ్రతికి బయటపడ్డాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'చాలా భయంకరమైన అనుభవం, అతనెంత భయపడ్డాడో అతని ముఖం చూస్తే అర్థమైపోతోంది' అని ఇంకొకరు అన్నారు. 'అతను చాలా ధైర్యవంతుడు అందుకే అంత ఓపికగా భరించాడు. వేరేవారు అయితే గుండె ఆగి చచ్చేవాళ్ళే' అని చెప్పుకొచ్చారు. చల్లగా ఉంటుందనే ఆలోచనతో ఇలా చెట్ల కిందా, పొదల ప్రాంతాలలో నిద్రపోకండి అని హెచ్చరిస్తున్నారు. అతనికి సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!
Updated Date - 2023-07-30T12:15:04+05:30 IST