ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అమ్మబాబోయ్ ఇదేం ఫ్యాషన్ తల్లీ.. ఈ మోడల్ డ్రస్సు.. ఆమె పడుతున్న అవస్థ చూస్తే నవ్వాపుకోలేరు..

ABN, First Publish Date - 2023-10-01T15:38:26+05:30

డిజైనర్లు రూపొందించిన దుస్తులలో తమ అందాన్ని ప్రదర్శించాలని మోడల్స్ ఉవ్విళ్లూరుతారు. కానీ ఈ మోడల్ అవస్థ చూస్తే..

ఫ్యాషన్ విభిన్నరకాలుగా ఉంటుంది. విదేశాలలో ఫ్యాషన్ దుస్తులు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఇక ఫ్యాషన్ షో లలో డిజైనర్లు రూపొందించిన దుస్తులు చాలా వింతగా ఉంటాయి. కొన్ని సార్లు డిజైనర్లు రూపొందించిన దుస్తులలో మోడల్స్ పడే అవస్థలు చూస్తే నవ్వొస్తుంది. ఓ మోడల్ ఫ్యాషన్ షో లో భాగంగా ధరించిన దుస్తులు చూసి అందరూ అవాక్కవుతున్నారు. అంతే కాదు ఆమె ర్యాంప్ వాక్ చేయడానికి పడిన అవస్థలు చూస్తే నవ్వాపుకోలేరు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఫ్యాషన్ ప్రపంచం(Fashion world) చాలా పెద్దది. ఇందులో తమ ప్రతిభ నిరూపించుకోవడానికి విభిన్న రకాల దుస్తులను రూపొందిస్తారు డిజైనర్లు. డిజైనర్లు రూపొందించిన దుస్తులలో తమ అందాన్ని ప్రదర్శించాలని మోడల్స్ కూడా ఉవ్విళ్లూరుతారు. ప్రపంచ ప్రతిష్టాత్మక ప్యాషన్ షో.. ప్యారీస్ ఫ్యాషన్ వీక్(Paris fashion week) లో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఫ్యాషన్ షో లో న్యూయార్క్ కు చెందిన క్రిస్టియన్ కోవన్ అనే డిజైనర్ తొలి ఫ్యాషన్ షో నిర్వహించాడు. ఇందులో భాగంగా ఒక వింత డ్రస్సు రూపొందించారు. నల్లటి క్లాత్ ముక్కలు అన్నీ అతికించి ఒక పెద్ద బంతి ఆకారంలో ఈ డ్రస్సును తయారు చేశారు. ఫర్ బాల్ ఆకారంలో ఉన్న ఈ డ్రస్సు ధరించిన తరువాత ముఖం పూర్తీగా కవర్ అయిపోతుంది. ముందు ఏముందో కూడా కనిపించదు. పెద్ద బంతి లాంటి ఆ డ్రస్సును వేసుకుని ఒక మోడల్ ర్యాంప్ వాక్ చేయడానికి వేదిక మీదకు వచ్చింది. ఆమె మొదట ఏమీ కనిపించకపోవడంతో గందరగోళంగా నడిచింది. అక్కడే పాటలు పాడుతున్న సామ్ స్మిత్ అనే గాయకుడు ఆమెకు సరైన దిశ చూపించినా ఆమె సరిగ్గా వెళ్లడంలో విఫలమైంది. ఆమె నేరుగా వెళ్లి ఫ్యాషన్ షో చూస్తున్న వీక్షకులపై పడింది. వెంటనే ఆమె డ్రస్ డిజైనర్, మరొకరు వచ్చి ఆమెను పైకి లేవదీశారు. ఆమె ఆ డ్రస్ లో ఫర్పెక్ట్ గా నడవగలిగితే నిజంగా చాలా మెచ్చుకునేవారే కానీ ఫెయిల్ అవ్వడంతో చాలా విమర్శలపాలవుతోంది.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!


ఈ వీడియోను diet_prada అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'ఇలాంటి డ్రస్ డిజైన్ చేసి మోడల్ ను అవమానపరిచినందుకు ఆ డిజైనర్ సిగ్గుపడాలి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అసలు ఆ ఫ్యాషన్ డ్రస్సు ఏంటి? అంత అవస్థలు ఎందుకు? దుస్తులు వేసుకునేముందు ఎలా ఉన్నాయనేది ఆ మోడల్ కు తెలియదా?' అని మరొకరు అన్నారు. 'వారు కావలానే అలా చేస్తున్నారు కదా.. వైరల్ కావడానికి కొన్ని మూమెంట్స్ ఉండాలి. అలా ఉంటే షో గురించి ఆసక్తి చూపిస్తారని వాళ్ల ఉద్దేశం కావచ్చు' అని ఇంకొకరు అన్నారు. మొత్తానికి ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు మాత్రం పిచ్చగా నవ్వుకుంటున్నారు.

Viral Video: పాపం జాయింట్ వీల్ ఎక్కి సరదా తీర్చుకుందామనుకుంది కానీ.. ఈ యువతి చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో మీరే చూడండి!


Updated Date - 2023-10-01T15:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising