ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఇదేం చపాతీ.. దీన్ని ఎలా చేశారో చూశాక.. తినాలంటేనే భయంతో పారిపోతారేమో..!

ABN, First Publish Date - 2023-08-04T10:48:37+05:30

డైటింగ్ చేసేవారు, మధుమేహాం ఉన్నవారు చపాతీకి ఎక్కువ ఓటు వేస్తారు. అయితే ఈ చపాతీని చూస్తే మాత్రం బహుశా తినే సాహసం చెయ్యరేమో..

చపాతీ ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగనించబడుతుంది. కల్తీ లేని గోధుమ పిండితో చేసిన చపాతీ పుష్టికరం కూడా. తెలుగురాష్ట్రాలలో చపాతీ కాస్తా కొంచెం రూపు మార్చుకుని పరాతాగా వ్యవహరించబడుతుంది. డైటింగ్ చేసేవారు, మధుమేహాం ఉన్నవారు చపాతీకి ఎక్కువ ఓటు వేస్తారు. అయితే ఈ చపాతీని చూస్తే మాత్రం బహుశా తినే సాహసం చెయ్యరేమో.. ఓ వ్యక్తి చపాతీ తయారుచేసిన విధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ అదేం చపాతీ.. చపాతీ తినాలన్న ఆశ చచ్చిపోతోంది దాన్ని చూస్తోంటే అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అందరినీ అసహనానికి గురిచేస్తున్న ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ఫుడ్ వీడియోలు(Food videos) చూసినప్పుడు జిహ్వచాపల్యం పెరుగుతుంది. తెలిసిన ఆహారమే అయినా ఫుడ్ వ్లాగర్స్ ఊరిస్తూ చెబుతుంటే ఆ ఫుడ్ ను ఒకసారి ఇంట్లోనే ప్రయత్నించడమో లేక బయటకు వెళ్లి టేస్ట్ చేయడమో చేయాలనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా చాలామంది ఎక్కువగా తినే ఆహారం చపాతీ. పంజాబ్(Punjab) లో ఈ చపాతీలను పరాతా అని పిలుస్తుంటారు. వీడియోలో ఓ పంజాబీ వ్యక్తి పరాతా అలియాస్ చపాతీని తయారుచేస్తున్నాడు(man making chapati). అతను స్టౌమీద పెనం ఉంచి దానిమీద కాస్త మందంగా ఒత్తిన చపాతీని వేశాడు. చపాతీలను, పరాతాలను కాల్చడానికి సాధారణంగా స్పూన్ తో నూనె వేస్తుంటారు. కానీ ఇతను మాత్రం విచిత్రంగా 15లీటర్ల ఆయిల్ క్యాన్ నుండి నూనె ఒంపాడు. అతనలా ఒంపడంతో దాదాపు 100మిల్లీలకు పైన నూనె ఆ చపాతీమీద పడింది. ఆ తరువాత పెనం ను స్టౌమీద నుండి తీసి చపాతీ మీద ఉన్న ఆయిల్ ను పక్కనే ఉన్న ఒక స్టీల్ డబ్బాలోకి ఒంపాడు. మళ్లీ ఆ చపాతీని తిరగేసి కాల్చడం మొదలెట్టాడు. ఈ విధంగా అతను చపాతీని కాలుస్తున్నాను అనుకుని ఏకంగా డీప్ ప్రై చేసినంత పని చేశాడు.

Viral Video: విమానం ఎక్కగానే కళ్ల ముందు ఊహించని సీన్.. పట్టరాని ఆనందంతో ఈ మహిళ కేకలు వేయడం వెనుక..!



ఈ వీడియోను gsfoodtravelsఅనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల దిమ్మతిరిగిపోతోంది. ఈ చపాతీని తయారీదారున్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.'ఆ చపాతీ తయారుచేస్తున్న పెద్దాయన కొడుకు కార్డియాలజిస్ట్ అని తెలుస్తోంది. అందుకే చపాతీలను నూనెలో ముంచి తీస్తున్నాడు' అని సెటైర్ వేశారొకరు. 'ప్రాణాలు తీయడానికి ఆ యముడే పరాతాను తయారుచేస్తున్నట్టు అనిపిస్తోంది' అని మరొకరు చమత్కారం చేశారు. 'చావుకు షార్ట్ కట్ మెథడ్ కనిపెట్టారు' అని కొందరు, 'అక్కడ చపాతీ పేరుతో కొలెస్ట్రాల్ అమ్ముతున్నారు' అని మరికొందరు పంచులు వేస్తున్నారు.

Tax Notice: ఇదేం ట్విస్ట్ బాబోయ్.. 10 ఏళ్ల క్రితమే చనిపోయిన మహిళకు ట్యాక్స్ నోటీస్.. రూ.7.56 కోట్ల పన్ను కట్టండంటూ..!


Updated Date - 2023-08-04T10:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising