ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇదేం పోయేకాలం నాయనా..? జుర్రుకుని మరీ తినాల్సిన మామిడి పండుతో ఇలాంటి నిర్వాకాలేంటి..? నెటిజన్ల ఫైర్..!

ABN, First Publish Date - 2023-04-26T16:21:53+05:30

అబ్బో మామిడితో చేసే ఎన్నో రకాలు జిహ్వను వహ్వా అనిపిస్తాయి. కానీ అవన్నీ కాదని మామిడిపండుతో కొత్త ప్రయోగం చేశారు వీళ్ళు. దీన్ని చూసిన నెటిజన్లు 'మీకేం పోయేకాలం వచ్చిందిరా నాయనా ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు' అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవికాలం వస్తోందంటే చాలామంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పండుకు యమా క్రేజ్ ఉంది. మామిడిపండ్లను నేరుగా తినకుండా మ్యాంగో జ్యూస్(mango juice), మ్యాంగో మిల్క్ షేక్(mango milk shake), మ్యాంగో లస్సీ(mango lassi), మ్యాంగో ఐస్ క్రీమ్(mango ice cream).. అబ్బో మామిడితో చేసే ఎన్నో రకాలు జిహ్వను వహ్వా అనిపిస్తాయి. కానీ పైన చెప్పుకున్నవన్నీ కాదని మామిడిపండుతో కొత్త ప్రయోగం చేశారు వీళ్ళు. దీన్ని చూసిన నెటిజన్లు 'మీకేం పోయేకాలం వచ్చిందిరా నాయనా ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు' అని విరుచుకుపడుతున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురికావడానికి వీళ్లేం చేశారో తెలుసుకుంటే..

మామిడి పండు(mangoes)తో చాలా రకాల వంటకాలు ఉన్నాయి. ఆవకాయ పచ్చడి నుండి ఐస్ క్రీమ్ వరకు ఎన్నో తయారు చేస్తారు. ఈ మధ్యన కొన్ని చోట్ల పానీపూరీ విక్రయించేవారు మ్యాంగో ప్లేవర్డ్ పానీపూరీ(mango flavoured pani puri) కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ పిజ్జా సెంటర్(pizza center) నిర్వాహకులు పండిన మామిడిపండుతో ఏకంగా పిజ్జాను తయారు చేసి అమ్ముతున్నారు. సాధారణంగా పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ వేస్తారు. కానీ ఈ మ్యాంగో పిజ్జా తయారీలో పిజ్జా సాస్ కు బదులుగా మామిడి పండు గుజ్జుతో తయారు చేసిన మ్యాంగో సాస్(Mango sauce) వేశారు. పిజ్జా మీద పన్నీర్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల స్థానంలో సన్నగా కట్ చేసిన మామిడిపండు ముక్కలను(sliced mango pieces) అందంగా అమర్చారు. దీని తరువాత ఆ మామిడిపండు ముక్కల మీద బ్రష్ సహాయంతో స్వీట్ చట్నీ కోటింగ్ ఇచ్చారు. పిజ్జాకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కాసిన్ని మామిడిముక్కలు పెట్టి కాస్త మ్యాంగో సాస్ వేశారు. అంతే మ్యాంగో పిజ్జా రెడీ అట. దీన్ని సాధారణ పిజ్జాలా ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది.. అందరూ కామన్‌గా చేసే ఈ మిస్టేక్ వల్లే..!


bombayfoodie_tales అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఫుడ్ కోసం వివిధ ప్రాంతాలు తిరిగే ఈ ఫుడ్ వ్లాగర్ మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం ముంబై(Mumbai) ప్రాంతమైన పోవై(Powai) లొకేషన్ లో ఈ పిజ్జాను టేస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు పిజ్జా హౌస్ నిర్వాహకుల మీద గుర్రుగా ఉన్నారు. 'మీకేం పోయేకాలం వచ్చిందిరా నాయనా.. హాయిగా జుర్రుకుంటూ తినాల్సిన మామిడిపండుకును ఇలా మార్చేశారు' అని మండిపడుతున్నారు. 'ఎంత ఆహారప్రియులు అయితే మాత్రం అడ్డమైన ప్రయోగాలు చేస్తారా?' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాంగో పిజ్జా విషయంలో ఫుడ్ లవర్స్, నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Bride Video: ఇలాంటి సీన్‌‌ను ఏ పెళ్లిలోనూ చూసి ఉండరు.. ఏడుస్తూ ఉన్న వధువును ఇలా ఎందుకు ఎత్తుకుని వస్తున్నారో తెలిస్తే..


Updated Date - 2023-04-26T16:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising