Viral Video: 30నిమిషాల్లో ఈ ఆమ్లెట్ తింటే లక్షరూపాయలు మీవే.. ఇంతకీ దీన్నెలా తయారు చేశారో మీరే చూడండి!!
ABN, First Publish Date - 2023-10-12T14:38:34+05:30
ఈ ఆమ్లెట్ ను 30నిమిషాలలో తింటే లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చేస్తానని ఆమ్లెట్ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తి చెబుతున్నాడు.
ఆమ్లెట్ అంటే ఇష్టపడనివారు ఉండరు. గొప్ప పోషకాహారమైన గుడ్డుతో చేసే ఆమ్లెట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కస్టమర్లను ఆకర్షించడానికి ఆహార విక్రేతలు బోలెడు రకాల ఆమ్లెట్లు ఎంతో రుచికరంగా తయారుచేస్తారు. అయితే ఇప్పుడు ఆమ్లెట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తయారుచేసిన ఆమ్లెట్ ను 30నిమిషాలలో తింటే లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చేస్తానని ఆమ్లెట్ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తి చెబుతున్నాడు. కాగా ఈ ఆమ్లెట్ తయారుచేసిన విధానం చూసి నెటిజన్లు గుడ్లు తేలేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఆరోగ్యాన్ని చేకూర్చే గుడ్డుతో(Eggs) బోలెడు రకాల వంటలు వండుతారు. కానీ ఆమ్లెట్(Egg omelette) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడొక స్పెషల్ ఆమ్లెట్ అందరికీ సవాల్ విసురుతోంది. ఢిల్లీ(Delhi)కి చెందిన రాజీవ్ అనే పేరు కలిగిన ఆమ్లెట్ విక్రేత ఈ వీడియోలో కనిపిస్తాడు. ఆమ్లెట్ తినండి, లక్షరూపాయలు మీవెంట తీసుకెళ్లండి అని అతను ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ ఆమ్లెట్ తయారుచేయడానికి మొదటగా వేడి పాన్ లో పెద్ద మొత్తం వెన్న(butter) వేస్తాడు. వెన్న కరిగేలోపు అతను 31గుడ్లను(31eggs) పగలకొట్టి సొనను ఒక గిన్నెలో సేకరిస్తాడు. ఆ తరువాత కరుగుతున్న వెన్నలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా వేసి బాగా కలుపుతాడు. తరువాత పాన్ లోకి 31గుడ్లను గిలక్కొట్టి పోస్తాడు. ఆమ్లెట్ సుమారుగా ఉడికిన తరువాత దానిమీద నాలుగు బ్రెడ్డు స్లైసులు ఉంచి దాన్ని తిరగేస్తాడు. ఆమ్లెట్ బాగా ఉడికిన తరువాత ఆమ్లెట్ మీద మసాలా పొడులు, పనీర్ తురుము, చీజ్ తురుము వేసి దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేస్తాడు. ఈ ఆమ్లెట్ ధర రూ.1320(31 eggs omelette cost rs.1320/-). దీన్ని 30నిమిషాలలో తినెస్తే అతను లక్షరూపాయలు ఇస్తాడట.
Home Tips: పాత దుస్తులను పారేస్తున్నారా..? అయితే మీరు ఈ 7 విషయాలనూ తెలుసుకోవాల్సిందే..!
ఈ వీడియోను ఫిట్నెస్ లవర్ Chirag Barjatya తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఈ ఆమ్లెట్ తయారీకి 450గ్రాముల వెన్న, 31గుడ్లు, 50గ్రాముల ఛీజ్, 100గ్రాముల కబాబ్, 200గ్రాముల పనీర్ వినియోగించారు. ఇందులో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ 3,575మి.గ్రా లు. మీ లక్షరూపాయలు వద్దు భాయ్' అని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గుడ్లు తేలేస్తున్నారు. మాంచి ఫిట్నెస్ ఉన్నవారు కూడా ఈ ఆమ్లెట్ చూసి ఉలిక్కిపడుతున్నారు. 'ఆ ఆమ్లెట్ తింటే తీవ్రమైన కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇది హార్ట్ అటాక్ ఆమ్లెట్. దీన్ని తింటే సులువుగా హార్ట్ అటాక్ వస్తుంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
Viral Video: స్వీట్లంటే ఇష్టమా? ఆగ్రా ఫేమస్ అయిన ఓ స్వీట్ ను ఎలా తయారుచేస్తున్నారో చూస్తే..
Updated Date - 2023-10-12T14:38:34+05:30 IST