Viral Video: వీధుల్లో బెలూన్లు అమ్ముకుంటున్న బుద్దిమాంద్యం కుర్రాడికి బిర్యాని ఇచ్చిన పాకిస్తాన్ మహిళ.. కుర్రాడి రియాక్షన్ మీరే చూడండి..
ABN, First Publish Date - 2023-03-16T13:05:06+05:30
మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అవతలి వారి నుండి థాంక్స్ అనే పదం వినిపిస్తుంది. కొందరు నవ్వుతూ కృతజ్ఞతలు తెలుపుతారు.
మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అవతలి వారి నుండి థాంక్స్ అనే పదం వినిపిస్తుంది. కొందరు నవ్వుతూ కృతజ్ఞతలు తెలుపుతారు. మరికొందరు ఇంకొంచెం ఎక్కువే చెబుతారు. కానీ మానసికంగా మెదడు ఎదగని వారిలో పసిపిల్లల ఛాయలు అలాగే ఉంటాయి. వారి చేష్టలో.. వారి మాటల్లో అదే కనిపిస్తుంది. బుద్దిమాంద్యం(Mental reterdation) ఉన్న కుర్రాడికి ఓ పాకిస్తానీ మహిళ బిర్యానీ(Pakistan Women Donate Biryani) ఇస్తే ఆ కుర్రాడి రియాక్షన్ చూసి నెటిజన్లు ఎమోషన్ అవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి వివరాలు తెలుసుకుంటే..
సమాజంలో విభిన్న రకాల మనుషులుంటారు. కొందరు వయసుతో పెరిగినా వారి మెదడు మాత్రం ఓ దశలోనే ఆగిపోయి ఉంటుంది. దీని కారణంగా వారు బుద్దిమాంద్యం అనే ట్యాగ్ తగిలించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి వారిలోనే విభిన్న ప్రతిభ(Different Talent), జీవిత పోరాటం కనబడతాయి. ఇలాగే జీవన పోరాటంలో వీధుల్లో బెలూన్లు అమ్ముకుంటూ(Selling Ballons) కనిపించాడు బుద్దిమాంద్యం కలిగిన క్రిష్ అనే కుర్రాడు. ఆ కుర్రాడి దగ్గరకు ఫైజా నయీమ్ అనే పాకిస్తాన్ మహిళ వెళ్ళింది. ఆమె క్రిష్ కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింది. అయితే ఆ కుర్రాడు బిర్యానీ తినకుండా తన దగ్గరున్న కవర్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ బిర్యానీ తినమని చెబితే.. ఇంటికెళ్ళి తింటానంటూ బదులిచ్చాడు. దీంతో ఆమె ఆ అబ్బాయి దగ్గరున్న కవర్ తీసుకుని అందులో బిర్యానీ ప్యాకెట్ పెట్టించింది. ఆ కుర్రాడు ఆమెకు కృతజ్ఞతగా తన దగ్గర అమ్మడానికి పెట్టుకున్న బెలూన్లు ఇచ్చాడు. ఆమె ఆ బెలూన్లు ఉచితంగా తీసుకోకుండా వాటికి సరిపడా డబ్బు క్రిష్ కు చెల్లించింది. దీంతో ఆ కుర్రాడు చాలా సంతోషించాడు. బిర్యానీ ఇచ్చినందుకు ఆమె మంచిమనసుకే అందరూ ఫిదా అవుతుంటే, ఆమెకు కృతజ్ఞతగా తన బెలూన్లు ఇవ్వడం ఆ కుర్రాడి కల్మషం లేని మనసును అందరికీ పరిచయం చేసింది. తన దగ్గరున్న బెలూన్లు అన్నీ అమ్ముడుపోయాయి, తన దగ్గర బిర్యానీ కూడా ఉందనే ఆనందం అతడి కళ్ళలో స్పష్టంగా కనిపించింది. ఆమె కుర్రాడి దగ్గర వీడ్కోలు తీసుకునేముందు కుర్రాడు ఆమె బుగ్గను చేత్తో ముద్దుపెట్టుకోవడం చూసి అందరూ ఎమోషన్ అవుతున్నారు.
ఫైజా నయూమ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram Page)లో ఈ వీడియో పోస్ట్ చేసింది. యూట్యూబ్ లో కూడా ఈ వీడియో అందుబాటులో ఉంది. మనుషుల మధ్య శత్రుత్వం, కోపం, అసహనం వంటివి కాదు ఉండాల్సింది, ఇలాంటి మంచి మనసు, ఒకరికి సహాయం చేసే గుణం, ఎదుటివారి కళ్ళలో సంతోషాన్ని తెప్పించడం.. ఇవే గొప్ప విషయాలు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read also: Water Bottle: సమ్మర్ లో వాటర్ బాటల్స్ బాగా వాడేస్తున్నారా? ఈ నిజం తెలిస్తే షాకవడం పక్కా..
Updated Date - 2023-03-16T13:05:06+05:30 IST