Viral Video: ఇలాంటి ప్రయోగం మీరెప్పుడూ చూసుండరు.. ఈ టీచర్ ఎంతబాగా చూపించారో చూడండి!
ABN, First Publish Date - 2023-03-27T11:19:22+05:30
టీచర్ ప్రయోగం చూసిన పిల్లలు నోరెళ్ళబెట్టారు, సంతోషంతో చప్పట్లు కొట్టారు.
ఈ ప్రపంచంలో వింతగా అనిపించే ప్రతి దాని వెనుకా కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం కనబడకుంటే వాటిని అతీతశక్తులని, మ్యాజిక్ అని అంటారు. అదే కారణం కనబడితే దాన్ని సైన్స్ అంటాం. ఒక టీచర్ సైన్స్ ఆధారంగా ఓ ప్రయోగం చేశాడు. అతని ప్రయోగం చూసిన పిల్లలు నోరెళ్ళబెట్టారు, సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఈ టీచర్ సూపర్ అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
సృష్టిలో ఎన్నో రహస్యాలకు సైన్స్(Science) సమాధానం చెబుతుంది. చిన్నప్పుడు తరగతిలో సైన్స్ ప్రయోగాలలో కొన్ని మ్యాజిక్ లాగా అనిపించేవి. ఓ సైన్స్ టీచర్ తన తరగతి పిల్లల ముందు చేసిన ప్రయోగం(Experiment) భలే ఉంది. పొగ నుండి మేఘం క్రియేట్ కావడం అది కాస్తా పిరమిడ్ గా పేర్చిన కాగితపు కప్పులను నేలకూల్చడం మ్యాజిక్(Magic) లాగే అనిపిస్తోంది. సైన్స్ టీచర్(Science Teacher) ఓ కుర్చీలో తరగతి పిల్లవాడిని కూర్చోబెట్టాడు. ఆ పిల్లాడి చేతుల్లో ఓ అట్టపెట్టె ఉంది. ఆ అట్టపెట్టెకు కింద భాగంలో పైప్ సెట్ చేశారు. దాని ముందు భాగంలో వృత్తాకారంలో రంధ్రం చేశారు. కింద పైప్ నుండి పొగ అట్టపెట్టెలోకి వెళ్ళి ముందరి రంధ్రం గుండా కొద్దికొద్దిగా బయటకు వస్తోంది. ఆ అట్టపెట్టెకు కొన్నిమీటర్ల దూరంలో కాగితపు గ్లాసులను పిరమిడ్ లాగా పేర్చారు. అప్పుడే పిల్లాడి వెనుక నిలబడుకుని ఉన్న సైన్స్ టీచర్ ఆ అట్ట పెట్టెను తన రెండు చేతులతో గట్టిగా, వేగంగా.. ఇరువైపులనుండి కొట్టాడు. అంతే ఆ అట్టపెట్టె నుండి మెల్లిగా బయటకు వస్తున్న పొగ కాస్తా బుల్లెట్ వేగంతో మేఘంలా బయటకు వచ్చింది. అది అలా ముందుకు వెళ్ళడం, దాని వెనుక కాస్త పొగ రింగులు రింగులుగా ఉండటం చూడొచ్చు. అది మధ్యలోనే మాయమైపోయినా పెట్టెను కొట్టినప్పుడు గాలివేగానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న కాగితపు కప్పుల పిరమిడ్ చెల్లాచెదురైపోయింది.
సాధారణంగా మ్యాజిక్ లా అనిపించే ఈ ప్రయోగం పూర్తిగా సైన్స్ మీద ఆధారపడుతుంది. ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ వీడియోను Nikola Tesla అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ఈ సైన్స్ టీచర్ నిజంగా చాలా గ్రేట్, ఇలా ప్రయోగాలు చేయడం సూపర్' అంటున్నారు. 'పిల్లలతోనే ప్రయోగాలు చేయించడం వల్ల పిల్లలకు చదువుమీద ఆసక్తి పెరుగుతుంది, సబ్జెక్ట్ మీద భయం పోతుంది' అని మరికొందరు అంటున్నారు. 'ఇంత మంచి టీచర్ దొరికినందుకు ఆ పిల్లలు చాలా లక్కీ' అని కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - 2023-03-27T11:31:41+05:30 IST