Viral Video: సైకిల్‌పై వీధుల్లో తిరుగుతూ సమోసాలు అమ్ముతున్న వికలాంగుడు.. ఇంగ్లీషులోనూ మాట్లాడుతోంటే అనుమానం వచ్చి ఓ వ్యక్తి ఆరా తీస్తే..
ABN, First Publish Date - 2023-04-20T18:02:17+05:30
అసలింతకూ నువ్వెవరు? ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్ననావేంటి?' అని ఆ కుర్రాడిని కదిలించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు వ్యాపారస్తులతో మాటలు కలుపుతూ ఉంటాం. ఏ ఊరు? ఎక్కడి నుండి వస్తారు? కుటుంబం ఏంటి? అని తెలుసుకుంటూ ఉంటాం. ఓ వ్యక్తి సమోసాలు కొంటున్నప్పుడు సమోసాలు అమ్ముతున్న కుర్రాడితో మాటలు కలిపాడు. ఆ కుర్రాడి మాటల్లో ఇంగ్లీషు నైపుణ్యం బయటపడింది. 'అసలింతకూ నువ్వెవరు? ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్ననావేంటి?' అని ఆ కుర్రాడిని కదిలించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇతని గురించి తెలిసి.. 'నువ్వు సూపర్ భయ్యా.. నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతావు' అంటున్నారు నెటిజన్లు. ఈ సంఘటకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం నాగ్ పూర్(Nagpur) లో సూరజ్ అనే ఓ వికలాంగ వ్యక్తి(specially-abled) నివసిస్తున్నాడు. అతను నాగ్ పూర్ వీధుల్లో సమోసాలు అమ్ముతుండగా(selling samosa) అక్కడికి ఓ ఫుడ్ బ్లాగర్(food blogger) వచ్చాడు. అతను సమోసాలు కొనుగోలు చేస్తూ సూరజ్ ను మాటల్లో దించాడు. సూరజ్ అద్బుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంటే 'నువ్వు ఎవరు? ఇంత చక్కగా ఇంగ్లీషు మాట్లాడుతున్నావేంటి?' అని అడిగాడు ఫుడ్ బ్లాగర్. అప్పుడే సూరజ్ తన గురించి అతనితో చెప్పాడు. వికలాంగుడైన సూరజ్ నాగ్ పూర్ యూనివర్శటీలో బియస్సీ పూర్తీ (B.sc completed in Nagpur University)చేశాడు.అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఉద్యోగం దొరకలేదు. ఐఏయస్(IAS) సాధించడం తన కల కావడంతో అందుకోసం కష్టపడి చదువుతూ ప్రతి రోజూ మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 7 వరకు సమోసాలు విక్రయిస్తున్నాడు. సమోసాలు అమ్మడం ద్వారా డబ్బు సేవ్ చేసుకుంటున్నాని, ఆ డబ్బు సివిల్ సర్వీస్ చదవడానికి వినియోగిస్తానని సూరజ్ పేర్కొన్నాడు. ఇతను ఒక ప్లేట్ సమోసాలు 15రూపాలయకు(Plate samosa 15rupees) అందిస్తున్నాడు. తన మోటార్ సైకిల్ లో సమోసాలు వెంటతెచ్చుకుని విక్రయిస్తున్నాడు.
సూరజ్ సమోసాలు అమ్ముతున్న సంఘటనను ఫుడ్ వ్లాగర్ వీడియో తీశాడు. ఈ వీడియోను youtubeswadofficial అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) షేర్ చేశారు. 'సివిల్ సర్వీస్ చదవాలనే లక్ష్యంతో ఇతను సమోసాలు అమ్ముతున్నాడు. ఇతనికి సహాయం చేద్దాం' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'నువ్వు సూపర్ భయ్యా చాలామంది యువతకు నువ్వు ఇన్స్పిరేషన్ అవుతావు' అని అంటున్నారు. 'వైకల్యం ఎప్పుడూ లక్ష్యాలకు ఆటంకం కాదు' అని అతని సంకల్పాన్ని మెచ్చుకుంటున్నారు.
Updated Date - 2023-04-20T18:02:17+05:30 IST