ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ ఆంటీ తెలివి తేటలు మామూలుగా లేవుగా.. రెండు నిమిషాల్లో అయే మ్యాగీతో ఇలా కూడా చేస్తారా..?

ABN, First Publish Date - 2023-04-25T15:14:34+05:30

ఈ ఆంటీ రెండు నిమిషాల్లో అయిపోయే మ్యాగీని కొత్తగా ప్రజెంట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ్యాగీ(Maggie) తయారీ రెండు నిమిషాలే.. అయితే దాన్ని మరింత రుచిగా వండటానికి ఇండియన్స్ చాలా సమయమే తీసుకుంటారు. కానీ ఈ ఆంటీ మాత్రం రెండు నిమిషాల్లో అయిపోయే మ్యాగీని కొత్తగా ప్రజెంట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తోంటే.. మరికొందరి పంచులకు, విమర్శలకు కారణం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ ప్రపంచంలో కొందరు తినడానికే పుట్టినట్టు ఉంటారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే పుడ్ వ్లాగ్స్(Food vlogs), ఫుడ్ బ్లాగ్స్(Food blogs) అంటూ కొత్త కొత్త రుచుల కోసం వీధులు, ఊర్లు, రాష్ట్రాలు కూడా పట్టుకుని తిరిగేవాళ్ళు ఉంటున్నారు. అలాగే ఓ ఫుడ్ బ్లాగర్(Food blogger) రుచికరమైన ఆహారం కోసం వెతుకుతూ ఓ ఆంటీని కలుసుకున్నాడు. రోడ్ సైడ్ బండి మీద స్నాక్స్ తయారు చేసి అమ్ముతున్న ఈ ఆంటీ రెండు నిమిషాలలో తయారయ్యే మ్యాగీతో కొత్త రుచిని పరిచయం చేసింది. ఆ ఆంటీ ముందుగానే ఉడికించిన మ్యాగీని ఒక హాట్ బాక్స్ లో పెట్టుకుని ఉంది. సాధారణంగా బ్రెడ్ తో శాండ్విచ్ లు తయారు చేస్తుంటారు. ఇంకా బ్రెడ్ స్లైసుల మధ్య బంగాళాదుంప కూర స్టఫ్ చేసి బ్రెడ్ పకోడా(potato stuffed bread pakora) చేస్తుంటారు. కానీ ఈ ఆంటీ మాత్రం రెండు బ్రెడ్ స్లైసులు(bread slices) తీసుకుని వాటి మధ్య మ్యాగీ నూడిల్స్ ఉంచింది.చూడ్డానికి శాండ్విచ్ లా కనిపించే దీన్ని త్రికోణాకారంలో కట్ చేసింది. ఈ బ్రెడ్ ను ముందే తయారుచేసి ఉంచుకున్న శనగపిండిలో ముంచి వేడి నూనెలో వేసి వేయించింది. కొద్ది సేపటి తరువాత మ్యాగీ బ్రెడ్ పకోడాను(Maggie bread pakora) చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రీన్ చెట్నీతో సర్వ్(serve with green chutney) చేసింది. ఫుడ్ బ్లాగర్ ఆ పకోడా తిని మైమరిపోయాడు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.

Viral Video: చిన్న పిల్లాడిని గుండెలపై పడుకోబెట్టుకుని స్కూటీపై ఇలా పడుకున్నాడో తండ్రి.. మరుక్షణంలోనే ఊహించని సీన్..!


ఈ వీడియోను foodpandits అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రమైన పంచ్ లు వేస్తున్నారు. 'ఆంటీ ఆ శనగపిండిలోకి ఐస్ క్రీం కూడా వేసి పకోడా చేయండి' అని పరిహాసం ఆడుతున్నారు. 'శనగపిండి కాస్త పలుచగా ఉంది కదా!!' అని అక్కడున్న లోపాన్ని బయటపెట్టి వంట గది ట్యాలెంట్ ను బయటపెట్టాడు మరొక నలభీముడు. 'బాబోయ్ మ్యాగీని కూడా పకోడాలో దూర్చేశారా ఇప్పుడు అంగారక గ్రహం మీదకు వెళ్లిపోవాలి' అని మరికొందరు అంటున్నారు.

Viral Video: బోట్‌లో వెళ్తూ చేపను పట్టి.. వెరైటీ ఫోజులతో సెల్ఫీ కూడా దిగాడు.. మరుక్షణంలోనే అతడు చేసిన ఒక్క మిస్టేక్‌తో..!


Updated Date - 2023-04-25T15:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising