Viral Video: మనుషుల్లో దేవుడంటే నువ్వే భయ్యా.. ఎర్రటి ఎండలో ఓ వృద్దుడు రిక్షా లాగుతోంటే చూడలేక ఈ ఆటోవాలా ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-06-19T16:03:44+05:30
నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్టు ప్రపంచంలో పేదలు, ధనికులు అని రెండు వర్గాలు ఉన్నారు. చెమట చిందనిదనే పేదవాడికి ముద్ద దొరకదు. ఒక్కసారి రహదారులను గమనిస్తే ఎంతోమంది పేదవారు వయసు తారతమ్యం లేకుండా కష్టపడుతూ ఉంటారు. మనవళ్ళు, మనవరాళ్ళను చూసుకుంటూ కొడుకు నీడలో హాయిగా గడపాల్సిన ఓ వృద్దుడికి కష్టం వచ్చింది. ఎర్రటి ఎండలో మోయలేని బరువుతో
నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్టు ప్రపంచంలో పేదలు, ధనికులు అని రెండు వర్గాలు ఉన్నారు. చెమట చిందనిదనే పేదవాడికి ముద్ద దొరకదు. ఒక్కసారి రహదారులను గమనిస్తే ఎంతోమంది పేదవారు వయసు తారతమ్యం లేకుండా కష్టపడుతూ ఉంటారు. మనవళ్ళు, మనవరాళ్ళను చూసుకుంటూ కొడుకు నీడలో హాయిగా గడపాల్సిన ఓ వృద్దుడికి కష్టం వచ్చింది. ఎర్రటి ఎండలో మోయలేని బరువుతో రిక్షా లాగుతున్న వృద్దుడి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వృద్దుడి కష్టం చూడలేక ఓ ఆటో వాలా చేసిన సహాయం అందరి హృదయాలను తాకుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఈ ప్రపంచంలో కష్టజీవులే ఎక్కువ ఉన్నారు. వీరిలో వృద్దులు(old peoples) కూడా ఉంటారు. పిల్లలు పట్టించుకోక శరీరం అంత సహకరించని దశలో కష్టపడి పనిచేసి పొట్టనింపుకుంటూ ఉంటారు. వీడియోలో ఓ వృద్దుడు(old man) రిక్షా లాగుతున్న దృశ్యం కనిపిస్తుంది. వృద్దుడు తన రిక్షా(rikshaw) మీద ఉంచిన బరువు చాలా ఎక్కువగా ఉంది. అది ఏకంగా ఓ ట్రక్కులో తీసుకువెళ్లడానికి సరిపడినంత ఉంది. అంత బరువును రిక్షామీద జాగ్రత్తగా అయితే కట్టేశారు కానీ ఆ బరువు లాగడం ఆ వృద్దుడికి చాలా కష్టంగా ఉంది. అతను ఎర్రటి ఎండలో, చెమటలు కార్చుతూ రిక్షాను లాగుతున్న విధానం, భారంగా పడుతున్న అడుగులే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ వృద్దుడు అలా కష్టపడుతోంటే వెనక నుండి ఓ ఆటో(auto) వచ్చింది. వృద్దుడు రిక్షా లాగడానికి పడుతున్న కష్టం చూసి ఆ ఆటోవాలా తన ఆటోను రిక్షాకు ఆనించాడు. రిక్షాను వెనుక నుండి తోస్తూ ముందుకు నడిపించాడు. ఆటో వాలా సపోర్ట్ వల్ల అప్పటి వరకు కష్టంగా రిక్షా లాగుతున్న వృద్దుడు రిక్షా ఎక్కి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్టతగ్గడం లేదా? ఈ 3రకాల గింజలు తిని చూడండి.. నిజంగా అద్భుతం చేస్తాయివి..
ఈ వీడియోను viralbhayani అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. 'దయ, మానవత్వం అన్నింటికంటే గొప్పవి' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా భావోద్వేగంతో కామెంట్స్ చేస్తున్నారు. 'మానవత్వానికి మించిన గొప్పదనం ఇంకేదీ లేదని ఆ ఆటో డ్రైవర్ నిరూపించాడు' అని కామెంట్ చేశారు. 'హృదయాన్ని హత్తుకునే సంఘటన' అని మరికొందరు అంటున్నారు. 'ఎవరైనా ఆ ఆటో డ్రైవర్ ను కనుక్కోగలరా? అతను నిజంగా అవార్డ్ కు అర్హుడు' అని కామెంట్ చేశారు. కాగా ఒక వినియోగదారు మాత్రం 'ఆ వృద్దుడు అంత బరువు లాగుతుంటే వీడియో తీస్తూ ఉండకపోతే వెళ్ళి సహాయం చేయచ్చుగా' అని ఫోటోగ్రాఫర్ మీద మండిపడ్డారు.
Head Bath: వారంలో ఎన్నిసార్లు తలస్నానం చెయ్యాలి? ఎలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుందంటే..
Updated Date - 2023-06-19T16:03:44+05:30 IST