ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బంగారంలాంటి మనవరాలు.. బంగారాన్నే కాదు.. ఈ బామ్మ ప్రాణాలనూ కాపాడింది..!

ABN, First Publish Date - 2023-03-10T17:58:23+05:30

ఈ బాలిక చూపించిన ధైర్యం, తెగువ ఆ పాప బామ్మ ప్రాణాలనూ.. ఆ బామ్మ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలా కాపాడిందో మీరే చూడండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిన్నపిల్లల సాహసాల గురించి కథలలో చదువుతుంటాం, సినిమాలలో చూస్తుంటాం. నిజజీవితాలలో ఇలాంటి ధైర్యవంతమైన పిల్లలు అక్కడక్కడా తమ సాహసాలతో మెరుస్తుంటారు. 10ఏళ్ల బాలిక చూపించిన ధైర్యం, తెగువ ఆ పాప బామ్మ ప్రాణాలనూ.. ఆ బామ్మ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా కాపాడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిచ్చర పిడుగు గురించి తెలుసుకుంటే..

మహారాష్ట్ర(Maharastra) రాష్ట్రం పుణే(Pune) జిల్లాలో లతా అనే 60ఏళ్ళ బామ్మ నివసిస్తోంది. ఈ బామ్మకు 10ఏళ్ళ రుత్వి అనే మనవరాలు ఉంది. బామ్మ మనవరాలిని వెంట తీసుకుని బయటకు వెళ్లింది. అవ్వా-మనవరాలు ఇద్దరూ రహదారి మీద ఫుట్ పాత్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డు పెద్ద రద్దీగా లేకపోవడంతో జనసంచారం తక్కువగా ఉంది. ఓ వ్యక్తి స్కూటీలో వచ్చి లతా బామ్మ దగ్గర ఆపాడు. ఒక అడ్రస్ చెప్పి అది ఎక్కడ అని బామ్మను అడుగుతూ అదను చూసి బామ్మ మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కోబోయాడు. అయితే వెంటనే అలర్ట్ అయిన బామ్మ అతన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చెయ్యసాగింది.అదే సమయంలో 10ఏళ్ళ రుత్వి భయపడకుండా తన చేతిలో ఉన్నబ్యాగ్ తో చైన్ స్నాచర్ ముఖం మీద దాడి చేసింది. ఆపకుండా బ్యాగ్ తో ముఖం మీద పంచులు ఇచ్చేసరికి ఆ చైన్ స్నాచర్ కు బైర్లు కమ్మాయి. బామ్మ చైన్ వదిలేసి తోకముడిచి అక్కడినుండి పారిపోయాడు. ఆ రోడ్ లో అమర్చిన సీసీటీవి కెమెరాలో ఈ సంఘటన మొత్తం రికార్ఢ్ కావడంతో ఈ బుల్లి ఫైటర్ చేసిన సాహసం అందరికీ తెలిసింది. Jist అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాప సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2023-03-10T17:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising