ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ పిల్లల ధైర్యానికి హ్యాట్సాప్.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కుక్కను ఎలా కాపాడారంటే..!

ABN, First Publish Date - 2023-08-04T13:58:52+05:30

మనకే ఇబ్బందీ లేదు కదా.. ఎవరో ఇబ్బంది పడితే మనకేంటి? అనుకునే ఎంతోమందిని ఆలోచనలో పడేస్తారు ఇలాంటి పిల్లలు..

చిన్నపిల్లలు వారికేం తెలుసు అని చాలా మంది పిల్లలను తక్కువ చేసి చూస్తుంటారు. కానీ పెద్దవాళ్లు పిల్లల్ని చూసి నేర్చుకోవలసిన విషయాలు బోలెడు ఉంటాయి. మనిషి పెద్దయ్యే కొద్దీ కఠినంగా మారుతుంటాడు. మానవత్వం కోల్పోతాడు. అయితే ఇలాంటి పిల్లలు పెద్దలకు మానవత్వపు అవసరాన్ని చాటి చెబుతున్నారు. మనకే ఇబ్బందీ లేదు కదా.. ఎవరో ఇబ్బంది పడితే మనకేంటి? అనుకునే ఎంతోమందిని ఆలోచనలో పడేస్తారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కుక్కను ఇద్దరు చిన్నారులు కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పిల్లల సాహసాన్ని మెచ్చుకుంటున్నారు, సూపర్ హీరోస్ అంటూ కొనియాడుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

'పిల్లలూ దేవుడు చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే' అని ఆరుద్రగారు ఎప్పుడో రాశారు. కాలం మారినా పిల్లల(children's) విషయంలో ఈ పాట అర్థం ఏమాత్రం మారలేదు. ఈ పిల్లలను చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. వీడియోలో ఒక కెనాల్ లో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. అదొక మురుగు ప్రవాహం అని నీటి రంగును బట్టి అర్థమవుతోంది. ఆ మురుగు ప్రవాహానికి అవతలివైపు ఓ కుక్క ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటోంది(dog stuck in drainage flow) . నీరు దాటి రావడానికి దానికి దారి కనిపించలేదు. పైపెచ్చు నీటి ప్రవాహం వెడల్పుగానూ, వేగంగానూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఏమి చెయ్యాలో తోచక ఆ కుక్క కాలువకు ఆనుకుని ఉన్న గోడకింద చిన్న ఖాళీ స్థలంలో నక్కి బిక్కుబిక్కుమంటోంది. దీన్ని ఇద్దరు పిల్లలు చూశారు. ఎవరైనా పెద్దవాళ్లు ముందుకొచ్చి ఆ కుక్కను కాపాడితే బాగుంటుందని, ఎవరైనా వస్తారేమోనని వారు వేచి చూడలేదు. తామే ఎందుకు ఆ కుక్కను కాపాడకూడదు అని అనుకున్నారు. అలా అనుకోవడంతోనే వారిద్దరూ కాలువలో దిగారు. ఆ కాలువలో నీరు పిల్లల మోకాళ్లకు పైనే ప్రవహిస్తోంది. నీటి వేగం ఎక్కువ ఉన్నా ఏమాత్రం భయపడకుండా కుక్కదగ్గరకు వెళ్లారు. ఆ కుక్కకూడా మరీ చిన్నది కాదు. దీంతో ఆ కుక్క బరువు పిల్లలు మోయలేనంత ఉంది. అయినా సరే ఒకరికొకరు సాయం చేసుకుంటూ దాన్ని అతికష్టం మీద మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు(kids save dog). ఈ సంఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పిల్లల సాహసం బయటికొచ్చింది.

Pressure Cooker: ప్రెజర్‌ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!



ఈ వీడియోను arya_vamshi17 అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఈ పిల్లలు సూపర్ హీరోస్.. మూగజీవులతో ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి' అని కాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లల సాహసానికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన సింగర్ నేహా భాసిన్ 'పిల్లల్లారా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు' అని కామెంట్ చేశారు. 'ఆ పిల్లలవి బంగారు మనసులు' అంటూ మరొకరు కామెంట్ చేశారు. 'నిజమైన హీరోలు వీళ్లే.. ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్లను చూసి గర్వించాలి' అని ఇంకొందరు అంటున్నారు.

Viral Video: బాబోయ్.. ఇదేం చపాతీ.. దీన్ని ఎలా చేశారో చూశాక.. తినాలంటేనే భయంతో పారిపోతారేమో..!


Updated Date - 2023-08-04T13:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising