Viral Video: ఇదేం పైత్యం తల్లీ.. బిస్కెట్లతో ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే..!
ABN, First Publish Date - 2023-12-08T12:10:15+05:30
లిటిల్ హార్ట్స్ బిస్కట్లంటే అదొక క్రష్ ఉంటుంది. కానీ ఈ మహిళ వాటిని ఎలా ఖరాబ్ చేసిందో చూస్తే..
బిస్కెట్లు చాలామంది సాయంత్రం పూట టీతోనూ, ప్రయాణాలలోనూ తింటూంటారు. చిన్నపిల్లలు ఆకలి అనగానే చాలామంది మొదట బిస్కెట్లు ఇస్తుంటారు. వీటిలో ఎక్కువ చక్కెరలుంటాయని తెలిసినా తింటుంటే క్రంచీగా, రుచిగా ఉండటం వల్ల బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. ఇక లిటిల్ హార్ట్స్ బిస్కట్లంటే అదొక క్రష్ ఉంటుంది. కానీ ఓ మహిళ మాత్రం వింత ప్రయోగం చేసింది. నార్మల్ గా తినాల్సిన బిస్కెట్లతో కొత్త వంటకాన్ని తయారుచేసింది. ఈ వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఒక్కసారికే షుగర్, గుండెపోటు రావాలంటే దీన్ని తప్పక తినాలి అని అంటున్నారు. అసలింతకీ ఈ మహిళ ఏం చేసిందో తెలుసుకుంటే..
యూట్యూబ్ పుణ్యమా అని ఎంతోమంది మహిళలు, మగవారు కూడా కుకింగ్ ఛానెల్స్ నడుపుతూ బోలెడు డబ్బు సంపాదిస్తుంటారు. ఇందులో భాగంగా వంటల ప్రయోగాలు చేస్తుంటారు. మొన్నామధ్య ఓ మహిళ టీను కూరలాగా వండటం, అంతకు మునుపు చేపలతో టీ తయారుచేయడం వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్లు టీ మద విరక్తి పుట్టిందన్నారు. అయితే ఇప్పుడు బిస్కెట్ల వంతు వచ్చింది. కొందరు ఓరియో, చాక్లెట్ చప్ బిస్కెట్లకు పాలు జోడించి మిల్క్ షేక్ చేస్తుంటారు. కానీ ఈ మహిళ ఏకంగా బిస్కెట్లతో హల్వా చేసేసింది(Women making halwa with biscuits). లిటిట్ హార్ట్స్ బిస్కెట్లంటే అందరికీ ఇష్టమే. వాటిమీద షుగర్ కోటింగ్ భలే ఉంటుంది. ఈ మహిళ దాన్ని ఖరాబ్ చేసింది. వీడియోలో మొదట లిటిల్ హార్ట్స్ బిస్కెట్లను ఒక పాన్ లోకి వేస్తుంది. ఆ తరువాత మళ్లీ పార్లీ జీ బిస్కెట్లను కూడా అదే పాన్ లోకి వేస్తుంది. రెండింటిలోకి రెండు చిన్న బాటిళ్ల బాదం పాలు కూడా కలుపుతుంది. బిస్కెట్లు మెత్తబడి బాగా పేస్ట్ గా అవుతున్నప్పుడు అందులో మళ్లీ పంచదార వేసింది. పంచదార బాగా కరిగాక రెండు పెద్ద స్పూన్ల నెయ్యి వేస్తుంది. మిశ్రమం అంతా బాగా ఉడికాక దాన్ని ఒక కప్పులో వేసి డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..!
ఈ బిస్కెట్ల హల్వా వీడియోను desi mojito అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. 'ప్రాసెస్ చేసి తయారుచేసిన బిస్కెట్లతో మళ్లీ హల్వా తయారుచేయడమా?' అని ఒకరు షాకవుతూ కామెంట్ చేశారు. 'దీన్ని తిన్న తరువాత షుగర్, గుండెపోటు రావడం ఖాయం' అని ఇంకొకరు అన్నారు. 'మహిళల ఇన్నర్ ట్యాలెంట్ ఇలాగే ఉంటుంది' అని మరొకరు కామెంట్ చేశారు. 'దీన్ని తినేముందు కార్డియాలజిస్ట్ అపాయిట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే కష్టం' అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టకూడని 7 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!
Updated Date - 2023-12-08T12:10:21+05:30 IST