ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కారును ఇలా కూడా తీసుకెళ్తారా? నెటిజన్లకు షాకిస్తున్న వీడియో..

ABN, First Publish Date - 2023-03-17T12:21:28+05:30

'అది కారనుకున్నారా.. లేక కంపోస్ట్ ఎరువు అనుకున్నారా?' అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాధారణంగా కారు కొన్నప్పుడో.. కారును ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడో దాన్ని ఎలా తరలిస్తారు. సిక్స్ వీలర్(Six Wheeler) లోనో.. పెద్ద పెద్ద ట్రక్కులలోనో(Big trucks) తీసుకెళ్ళడం మీరు చూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తీగా భిన్నంగా ఉంది. వీళ్ళు కారును తరలించిన విధానం చూసి 'అది కారనుకున్నారా.. లేక కంపోస్ట్ ఎరువు అనుకున్నారా?' అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుంటే..

మన దేశంలో రహదారుల మీద చాలా వింతలు, విచిత్రాలు కనబడుతుంటాయి. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసే ఘనులు మన భారతీయులు. అదే విధంగా ఒకరు మారుతి కార్ ను తరలించడంలో తమదైన మార్క్ చూపించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఏకంగా మహీంద్రా బొలెరో(Mahindra Bolero) వాహనంలో మారుతీ కారును(Maruti car) పెట్టి తీసుకెళుతుండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత చిన్న వాహనంలో అంత పెద్ద కారును తీసుకెళ్ళడం ఆశ్చర్యపరిచే విషయమైతే, అసలు ఆ కారును దాంట్లో ఎలా పెట్టారు అని నోరెళ్ళబెడుతున్నారు చూసినవారు.

'ఇది మహీంద్రా వాహనాల సామర్థ్యానికి ఉదాహరణ అని గర్వపడాలా లేక పరిధికి మించిన బరువు గల వాహనాన్ని తీసుకెళ్తున్నందుకు అభ్యంతరం చెప్పాలా?' అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోను rajpam14 అనే ఇన్స్టా యూజర్(Insta User )ఇన్స్టాగ్రామ్(Instagram) లో షేర్ చేశారు. దీనిమీద నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇాలాంటి గొప్ప ఐడియాలు ఇండియన్స్ కే వస్తాయని, మన వాళ్లే ఇలాంటి గొప్ప పనులు చేయగలరని పంచులు వేస్తున్నారు.

Read also: Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!


Updated Date - 2023-03-17T12:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising