Viral Video: ఈ రైతు తెలివి మామూలుగా లేదుగా.. పొలంలో ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఇదేంటో.. ఎందుకు పెట్టాడో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-04-13T16:46:34+05:30
ఈ మధ్య కాలంలో రైతులు(farmers)పంట పొలాల(farms) దగ్గర చేసుకుంటున్న ఏర్పాట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు వీళ్ళకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అనిపిస్తుంటుంది.
గొప్పగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటే పొరపాటే.. సామాన్యుడిలో అద్బుతమైన తెలివి దాగుంటుంది. ఈ మధ్య కాలంలో రైతులు(farmers)పంట పొలాల(farms) దగ్గర చేసుకుంటున్న ఏర్పాట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు వీళ్ళకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఓ రైతు తన పొలంలో చేసిన ఏర్ఫాటుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రైతు తన పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఓ ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఉన్నదేంటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో ఇతనికి ఇంత తెలివుందేంటి?' అని ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఓ రైతు తన పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్(Transformer) దగ్గర కాస్త విభిన్నంగా ఆలోచించాడు. ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఓ స్పీకర్ సెట్ చేశాడు. అందులో నుండి పాటు ప్లే అవుతున్నాయి. దీన్ని చూసినవారు అతను పొలం పనులు చేస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండేందుకో లేక అతను సంగీత ప్రియుడవడం వల్లో ఇలా చేశాడని అనుకుంటున్నారు. కానీ అసలు నిజం అది కాదు. ట్రాన్స్‌ఫార్మర్ కు మ్యూజిక్ ప్లేయర్(music player)player) కనెక్ట్ చేసి దాని పక్కనే స్పీకర్(Speaker) ను సెట్ చేయడం వల్ల కరెంట్ రాగానే ఆ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ అయ్యి పాటలు ప్లే(play songs while current coming) అవుతాయి. పాటలు స్పీకర్ ద్వారా పెద్దగా వినబడటంతో రైతు సకాలంలో మోటార్ వేసి తన పంటకు నీళ్ళు పట్టుకోగలుగుతున్నాడు. ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర స్పీకర్ ఉండటం, అందులో నుండి పాటలు ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Tea: సాయంత్రమైతే చాలు టీ షాప్‌కు వెళ్లి మగాళ్లంతా చేసే పని ఇదే.. కానీ అదెంత డేంజరో తెలిస్తే.. ఇక వాటి జోలికే వెళ్లరు..!
yogesh_patidar8877_ అనే ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. 'మేము పల్లెటూరివాళ్ళం ఏదైనా చేయగలం' అని వీడియో మీద క్యాప్షన్ మెన్షన్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది ఈ రైతును నిందిస్తున్నారు. 'ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగం' అంటున్నారు. మరికొందరు మాత్రం ఇందులో ఉన్న లాజిక్ అర్థం చేసుకున్నారు. 'కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఏంటి? అనే విషయం తెలుసుకోవడానికి ఇదొక మంచి మార్గం. రైతులకు చక్కగా ఉపయోగపడుతుంది' అని అంటున్నారు.
Viral Video: సింహంతో సెల్ఫీ అంత ఈజీ కాదమ్మాయ్.. స్మార్ట్ ఫోన్ తీసుకుని ఫొటో క్లిక్‌మనిపించే లోపే షాకింగ్ ట్విస్ట్..!
Updated Date - 2023-04-13T16:46:34+05:30 IST