ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ట్రైన్లో ప్రయాణిస్తున్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. రాత్రి 2గంటల సమయంలో టాయిలెట్ కు వెళ్ళడానికి అతను పడిన అవస్థలు చూస్తే..

ABN, First Publish Date - 2023-06-19T17:53:27+05:30

ఓ కుర్రాడు తన స్నేహితుడితో కలసి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అతను రాత్రి 2గంటల సమయంలో టాయిలెట్ కు వెళ్ళాల్సి వచ్చింది. తన బెర్త్ దిగగా అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను టాయిలెట్ కు వెళ్ళడానకి పడిన అవస్థలు చూస్తే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలో ఎక్కువ మంది ప్రయాణాలు చేసేది ట్రైన్లలోనే. ఖర్చు దృష్ట్యా చాలామంది ట్రైన్ జర్నీ ఎంచుకుంటారు. మరీ ముఖ్యంగా దూరప్రయాణాలు చేయాలని అనుకునేవారు ట్రైన్ జర్నీకే ఓటు వేస్తారు. ఓ కుర్రాడు తన స్నేహితుడితో కలసి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అతను రాత్రి 2గంటల సమయంలో టాయిలెట్ కు వెళ్ళాల్సి వచ్చింది. అతను వెంటనే టాయిలెట్ కు వెళ్ళడానికి తన బెర్త్ దిగగా అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను టాయిలెట్ కు వెళ్ళడానకి పడిన అవస్థలు చూస్తే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కళ్లెర్ర జేసేవారు కొందరైతే కడుపు చెక్కలయ్యేలా నవ్వేవాళ్ళు కొందరు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో చాలామంది ట్రైన్ జర్నీకే(Train journey) పెద్ద పీట వేస్తారు. పడుకోవడానికి బెర్త్, రద్దీ లేని బోగీలు అయితే ఈ ప్రయాణాలు కావలసింత ప్రశాంతతను ఇస్తాయి. కానీ దానికి రివర్స్ గా రద్దీగా ఉన్న కంపార్ట్మెంట్లలో ప్రయాణమంటే పెద్ద తలనొప్పే. మరీ ముఖ్యంగా రద్దీ కంపార్ట్మెంట్లలో టాయిలెట్ కు వెళ్ళడం పెద్ద టాస్క్ అనుకోవచ్చు. ఓ కుర్రాడు తన స్నేహితునితో కలసి ఔరంగాబాద్ నుండి ముంబై వెళ్లే దేవగిరి ఎక్స్పెస్(devagiri express) లో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు. ట్రైన్ జర్నీలో రాత్రి 2గంటల సమయంలో(night 2 AM) కుర్రాడి స్నేహితుడు టాయిలెట్ వెళ్లాల్సి వచ్చింది. అతను తన బెర్త్ దిగి చూడగా కంపార్డ్మెంట్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. నేలమీద ప్రయాణికులందరూ కూర్చుని ఉన్నారు. దారి మొత్తం కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంత ఇరుకుగా తయారయ్యింది . అలాంటి సమయంలో ఆ కుర్రాడి స్నేహుతుడు ట్రైన్ బెర్త్ లకు ఉన్న రాడ్ లను పట్టుకుని సీట్ల మీద అడుగులు వేస్తూ ప్రజల పై నుండి టాయిలెట్ కు వెళ్ళాడుyoung man going toilet in devagiri express). ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటయి. కానీ ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Head Bath: వారంలో ఎన్నిసార్లు తలస్నానం చెయ్యాలి? ఎలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుందంటే..


ఈ వీడియోను Abhijeet Dipke అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. 'నా కజిన్ తన స్నేహితుడితో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రైలు ప్రయాణాన్ని అడ్వెంచర్ స్పోర్ట్ గా మార్చినందుకు ధన్యవాధాలు' అని క్యాప్షన్ తో ఇండియన్ రైల్వే కు చురక అంటించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భారతీయ రైల్వే సౌకర్యాల మీద కన్నెర్ర జేస్తున్నారు. 'పండుగలు, సెలవుల రోజులలో ఇలాంటి పరిస్థితులు సాధారణం. నేను అలాంటి పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొన్నాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'జనరల్ కంపార్ట్మెంట్లే కాదు, థర్డ్ ఏసీలో కూడా కొన్నిసార్లు అవే పరిస్థితులు ఉంటాయి' అని మరొకరు చెప్పుకొచ్చారు. 'ఆ కుర్రాడు జనరల్ కోచ్ లో మొదటిసారి ప్రయాణిస్తున్నట్టున్నాడు.జనలర్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరూ తెలుసుకోవాలి' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Viral Video: మనుషుల్లో దేవుడంటే నువ్వే భయ్యా.. ఎర్రటి ఎండలో ఓ వృద్దుడు రిక్షా లాగుతోంటే చూడలేక ఈ ఆటోవాలా ఏం చేశాడంటే..


Updated Date - 2023-06-19T17:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising