ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడో వృద్ధుడు.. ఓ కుర్రాడు తన వైపే రావడం చూసి కంగారు.. ట్యాబ్‌లో అతడు చూపించిన ఫొటోను చూసి..!

ABN, First Publish Date - 2023-05-31T16:09:06+05:30

వీధుల్లోనూ, రహదారుల మీదా వెళ్తున్నప్పుడు చాలా చోట్ల వృద్దులు కష్టపడి పనిచేస్తూ కనిపిస్తారు. అలాంటి వారు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతారు. ఓ తాత వీధిలోని టిఫిన్ సెంటర్లో కష్టపడి పనిచేస్తోంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊహించని సంఘటనలు జరిగినప్పుడు చాలా షాకవుతుంటాము. టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్న ఓ వృద్దుడికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. తన మానాన తాను మిర్చి బజ్జీలు వేస్తున్నాడొక తాత. ఆ తాత వైపే ఓ కుర్రాడు చాలా సీరియస్ గా వస్తుండటంతో ఆయన కంగారు పడ్డాడు. తీరా ఆ కుర్రాడు తాత దగ్గరకు వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసి తాత షాకయిపోయాడు. అతను కుర్రాడి వైపు ట్యాబ్ వైపు సీరియస్ గా చూస్తుండిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వీధుల్లోనూ, రహదారుల మీదా వెళ్తున్నప్పుడు చాలా చోట్ల వృద్దులు(old peoples) కష్టపడి పనిచేస్తూ కనిపిస్తారు. అలాంటి వారు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతారు. శంకర్ దాదా ఎంబిబియస్(Shankar dada MBBS) సినిమాలో హాస్పిటల్ మొత్తం పదే పదే తుడుస్తూ చిరాకు పడే తాత ముఖంలో ఒక్క ఆత్మీయ కౌలిగి(soul full hug) ద్వారా తాత ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాడు మెగాస్టార్. ఓ కుర్రాడు ఇలా చేయకపోయినా తనకు వచ్చిన పనితో తాతగారి ముఖంలో నవ్వు తీసుకురావాలని అనుకున్నాడు. వీడియోలో ఓ తాతగారు టిఫిన్ సెంటర్లో కష్టపడి బోండాలు, మిర్చిబజ్జీలు(old man making bonda) తయారు చేస్తున్నాడు. కుర్రాడు ఆ తాతగారి దగ్గరకు వెళ్ళి మిర్చి బజ్జీలు, బోండాలు కొన్ని కొనుగోలు చేశాడు. ఆ తాతకు కాస్త దూరంలో కూర్చుని అతని దగ్గరున్న ట్యాబ్(tab) లో అతనికెంతో నైపుణ్యం ఉన్న డిజిటల్ ఆర్డ్(digital art) లో తాత బోండాలు తయారు చేస్తున్న పెయింట్ వేశాడు(young man draw old man's digital art) . తాత పెయింగ్ కు చక్కగా రంగులద్ది మొత్తం పూర్తయ్యాక ఆ కుర్రాడు సీరియస్ గా తాత దగ్గరకు వెళ్ళాడు. ఆ కుర్రాడు తనవైపే వస్తుండటం చూసి తాతగారు కాస్త కంగారు పడ్డారు. కుర్రాడు ట్యాబ్ ను తాత ముందుకు చాపాడు. తనకెందుకు ఇస్తున్నాడో అర్థం కాక తాత భయంభయంగా ట్యాబ్ వైపు చూశాడు. అందులో తన బొమ్మ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. కుర్రాడి వైపు, తన పెయింట్ వైపు మార్చి మార్చి చూశాడు. ఆ తరువాత చాలా సంతోషంగా నవ్వుతాడు. ట్యాబ్ ను తన రెండుచేతుల్లోకి తీసుకుని తన పెయింట్ చూసుకుంటూ చాసా సేపు మురిసిపోయాడు.

Mahima Datla: ఎవరీ మహిమ దాట్ల..? హైదరాబాద్ కు చెందిన ఈమె ఆస్తి ఏకంగా రూ.8700 కోట్లు..!


ఈ వీడియోను మనోజ్ కుమార్ అనే డిజిటల్ ఆర్ట్ పెయింటర్ Manojdrawz అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'మీరు వేసిన పెంయింట్ ప్రింట్ తీసి ఇవ్వండి, ఆ తాత దాన్ని చాలా భద్రంగా దాచుకుంటాడు' అని అంటున్నారు. 'ఆ తాత నవ్వు ఎంతబాగుందో.. నవ్వుతూనే ఆరోగ్యంగా మారిన నసీరుద్దీన్ షాలా కనిపిస్తున్నాడు' అని ఆ తాత నవ్వును మెచ్చుకుంటున్నారు. 'ఆ తాత నవ్వుతుంటే ఏదో మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తోంది' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Wife: నా భార్య కంటే ఆమె అందంగా ఉందా..? అందాల పోటీల వేదికపైనే బీభత్సం సృష్టించిన భర్త..!


Updated Date - 2023-05-31T16:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising