Viral Video: భారత మాజీ క్రికెటర్ షేర్ చేసిన వీడియోను తెగ చూసేస్తున్న నెటిజన్లు.. వీడియో పాతదే.. అయినా వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది..!
ABN, First Publish Date - 2023-03-21T13:30:22+05:30
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) షేర్ చేసిన ఓ పాత వీడియో ట్విటర్‌లో (Twitter) తెగ హల్‌చల్ చేస్తుంది.
Viral Video: భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) షేర్ చేసిన ఓ పాత వీడియో ట్విటర్‌లో (Twitter) తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను నెటిజన్లు ఎగబడి మరీ చూసేస్తున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో లక్ష్మన్ ఈ వీడియోను షేర్ చేశారు. 22సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.8మిలియన్ల వ్యూస్, 18వేల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చెప్పలేదు కదూ. ఓ ఆరేళ్ల బాలుడిని రైల్వే పాయింట్స్‌మెన్ (Railway Pointsman) కాపాడడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన పాతదే. అయితే, ఈ వైరల్ వీడియోను తాజాగా లక్ష్మణ్ షేర్ చేయడంతో అది వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. గతేడాది ఏప్రిల్‌లో థానే పరిధిలోని వంగానీ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
ఓ మహిళ ఆరేళ్ల బాలుడిని తీసుకుని రైల్వే స్టేషన్‌లో నడుచుకుంటు వెళ్తోంది. ఆ సమయంలో బాలుడు కాలుజారి రైల్వే పట్టాలపై పడిపోతాడు. అదే సమయంలో ఎదురుగా ఓ ట్రైన్ వస్తుంటుంది. ఇక బాలుడు రైలు పట్టాలపై పడిపోవడం గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న పాయింట్స్‌మెన్ మయూర్ షెల్కే (Mayur Shelke) సమయస్ఫూర్తి ప్రదర్శిస్తాడు. వెంటనే పరిగెత్తుకుంటు వచ్చి బాలుడిని పట్టాలపై నుంచి లేపి ఫుట్‌పాత్‌పై పడేస్తాడు. ఆ తర్వాత అతడు కూడా పైకి వచ్చేయడం మనం వీడియోలో చూడొచ్చు. సెకండ్ల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోతుంది. ఇక తన ప్రాణాలకు తెగించి బాలుడి ప్రాణాలు కాపాడిన మయూర్‌కు ఇండియన్ రైల్వే రూ.50వేల రివార్డ్ ఇచ్చింది. అయితే, పాయింట్స్‌మెన్ మాత్రం అందులో సగం బాలుడి చదువులకు ఇవ్వడం జరిగింది. ఈ ఘటన తాలూకు వీడియోను తాజాగా లక్ష్మణ్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా పిల్లోడిని కాపాడేందుకు మయూర్ చూపిన ధైర్యాన్ని, ఆ తర్వాత అతడు చాటిన దాతృత్వాన్ని మెచ్చుకుంటు లక్ష్మణ్ ఈ వీడియోను షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: 'రికార్డులో నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి'.. ఈ డైలాగ్ ఈయనకు సరిగ్గా సరిపోతుంది..!
Updated Date - 2023-03-21T13:31:40+05:30 IST