ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: రూ.5 వేల జీతం కోసం రోజూ 8 గంటల పాటు కష్టపడుతున్న తల్లి.. ఆమె ఫొటోలను ట్వీట్ చేస్తూ కొడుకు చేసిన పనేంటంటే..!

ABN, First Publish Date - 2023-06-02T17:48:23+05:30

పిల్లల సంక్షేమం కోసం తల్లి ఎంత కష్టాన్ని అయినా భరిస్తుంది. అదే పిల్లలకు చిన్న కష్టం వచ్చినా భరించలేదు. వారు పెరిగి పెద్దవారై.. సొంత కాళ్ల మీద నిలబడితే చూసి సంతోషిస్తుందే తప్ప.. వారి నుంచి ఏమీ ఆశించదు. అందుకే తల్లి ప్రేమను మించినది ఈ లోకంలో మరేదీ లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లల సంక్షేమం కోసం తల్లి ఎంత కష్టాన్ని అయినా భరిస్తుంది. అదే పిల్లలకు చిన్న కష్టం వచ్చినా భరించలేదు. వారు పెరిగి పెద్దవారై.. సొంత కాళ్ల మీద నిలబడితే చూసి సంతోషిస్తుందే తప్ప.. వారి నుంచి ఏమీ ఆశించదు. అందుకే తల్లి ప్రేమను మించినది ఈ లోకంలో మరేదీ లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ తల్లి రూ.5వేల జీతం కోసం రోజూ 8గంటల పాటు కష్టపడుతోంది. ఆమె ఫొటోలను షేర్ చేసిన కొడుకు.. చివరకు ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు (Viral news) కొడుతోంది. ఈ పోస్టను ఆయుష్ గోయల్ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఇతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో చాలా ఇబ్బందులు పడేవారు. యువకుడు చదువుకునే రోజుల్లో కనీసం కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితి ఉండేది. ఇది అతడి తల్లిని (mother) తీవ్రంగా కుంగదీసింది. ఎలాగైనా కొడుకును బాగా చదివించాలనే ఉద్దేశంతో తాను కష్టపడాలని నిర్ణయించుకుంది. కేవలం రూ.5వేల కోసం రోజూ 8గంటల పాటు కష్టపడింది. తద్వారా కొడుకును బాగా చదివించుకుంది. అనంతర కాలంలో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న కొడుకు.. ఇటీవల ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆన్‌లైన్‌లో రాయడం (Online Jobs) మొదలుపెట్టాడు. ఇలా వివిధ పనులు చేయడం ద్వారా డబ్బులు బాగా సంపాదించాడు.

Bride: వామ్మో.. ఈ పాము పెద్ద కథే నడిపిందిగా.. ఈ వధువు వద్దకు వరుడిని ఎలా రప్పించిందో మీరే చూడండి..!

డబ్బులు బాగా సంపాదించడంతో కొద్ది నెలల్లోనే చిన్న గది నుంచి రెండు గదుల ఇంటికి మారారు. ఇదిలావుండగా, తాజాగా ఆయుష్.. గతంలో తన తల్లి పడి కష్టాన్ని గుర్తు చేస్తూ ఫొటోలు షేర్ చేశాడు. ‘‘నా తల్లి కుటుంబం కోసం తక్కువ జీతానికి ఉదయం నుంచి సాయంత్రం వరకూ కష్టపడింది. ట్విట్టర్ (Twitter) నా జీవితాన్నే కాకుండా మా అమ్మ జీవితాన్ని కూడా మార్చేసింది. స్నేహితులందరికీ ధన్యవాదాలు’’.. అని ప్రస్తావిస్తూ తన తల్లి ఫొటోలను (mother photos) షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘మీ కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది’’.. అని కొందరు, ‘‘మీ కథ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి’’.. అని మరికొందరు, ‘‘ఈ తల్లిది చాలా గొప్ప మనసు’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-02T17:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising