నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎస్ఐకి చెప్పిన యువతి.. పోలీసుల సమక్షంలోనే పెళ్లి ఫిక్స్.. కొన్ని రోజుల తర్వాత..
ABN, First Publish Date - 2023-02-05T18:47:08+05:30
అతనో ఎస్ఐ.. కరోనా కారణంగా భార్య చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువతి.. నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చింది. నాకు, నీకు వయసు చాలా తేడా ఉంది.. మరోసారి ఆలోచించుకోమంటూ ఎస్ఐ సలహా ఇచ్చాడు. అయినా..
అతనో ఎస్ఐ.. కరోనా కారణంగా భార్య చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువతి.. నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చింది. నాకు, నీకు వయసు చాలా తేడా ఉంది.. మరోసారి ఆలోచించుకోమంటూ ఎస్ఐ సలహా ఇచ్చాడు. అయినా అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు పోలీసుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బస్తీ జిల్లా గోరఖ్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎస్ఐగా పని చేస్తున్న బలరాం యాదవ్ అనే వ్యక్తి భార్య.. 2021లో కరోనా కారణంగా మృతి (Corona Death) చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల రామ్‌గఢ్ తాల్ పరిధిలో నివాసం ఉంటున్న రేణు యాదవ్.. ఎస్ఐపై మనసు పడింది. నిన్ను పెళ్లి చేసుకుంటా.. అని నేరుగా కలిసి చెప్పింది. తన భార్య చనిపోయిన విషయంతో పాటూ తన వయసు తదితర విషయాలు చెబుతూ.. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని సదరు యువతికి సలహా ఇచ్చాడు. అయినా యువతి (young woman) బలరాంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఓ రోజు రేణు తన బంధువులు, మరో ఇద్దరు పోలీసులతో కలిసి బలరాం ఇంటికి వెళ్లింది.
అంతా కలిసి మాట్లాడుకుని, పెళ్లి ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలో 2022 జనవరి 7న ఆలయంలో ఘనంగా వివాహం (marriage) చేసుకున్నారు. కొన్నాళ్లు భర్తతో కలిసి సంతోషంగా గడిపింది. ఫిబ్రవరి 25న తోటి మిత్రులతో కలిసి వచ్చి.. ఎస్ఐ పర్సు, ఏటీఎం, నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న బలరాం షాక్ అయ్యాడు. చివరకు విచారణలో రేణు గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఎస్ఐ రామానంద్ చౌదరిని కూడా ఇలాగే మోసం చేసిందని తేలింది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. రేణు గురించి తెలుసుకున్న బలరాం.. చివరకు స్పెషల్ మ్యారేజ్ ఆఫీసర్ ఎదుట హాజరై వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
Updated Date - 2023-02-05T18:47:15+05:30 IST