ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: తనపై ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలని భార్యకు వింత పరీక్ష.. ఆమె చెప్పిన షాకింగ్ సమాధానంతో.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-07-04T21:57:25+05:30

భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా చివరకు సీరియస్‌గా మారుతుంటాయి. ప్రధానంగా దంపతులు ఒకరిపై ఇంకొంకరు అనుమానం పెంచుకోవడం వల్లే గొడవలు మొదలవుతుంటాయి. మరికొందరు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా చివరకు సీరియస్‌గా మారుతుంటాయి. ప్రధానంగా దంపతులు ఒకరిపై ఇంకొంకరు అనుమానం పెంచుకోవడం వల్లే గొడవలు మొదలవుతుంటాయి. మరికొందరు దంపతులు సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తనపై ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలని ఓ వ్యక్తి తన భార్యకు వింత పరీక్ష పెట్టాడు. ఆమె చెప్పిన సమాధానంతో చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండాలోని బాబేరు కొత్వాలి పరిధి హర్దౌలీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి భార్య రిజ్వానాతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో సంతోషంగా జీవించేవారు. అయితే ఇటీవల భర్తకు వచ్చిన సందేహం వల్ల సమస్య వచ్చిపడింది. ఇటీవల ఓ రోజు దంపతులిద్దరూ (couple) సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. భర్తకు ఉన్నట్లుండి ఓ సందేహం వచ్చింది. ‘‘నా మీద నీకు ప్రేమ ఉందా.. ఒకవేళ నేను చనిపోతే నువ్వూ చనిపోతావా’’.. అని భార్యను అడిగాడు.

Viral Video: గుడికి దగ్గర్లో.. రోడ్డు పక్కన టీ షాపు నడుపుతున్న ఈ మహిళ.. ఆయనకు స్వయానా చెల్లెలు అని తెలిసి అవాక్కైన భక్తులు..!

ఇందుకు ఆమె ‘‘నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే’’.. అని భర్తకు బదులిచ్చింది. దీంతో నిజాముద్దీన్ వెంటనే విషం (poison) తాగాడు. భర్త (husband) చేసిన పనికి షాకైన భార్య.. తర్వాత తానూ విషం తాగింది. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం దంపతులు చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కూతురిని రైలు ఎక్కించిన తండ్రి.. తొందరపాటులో చేసిన తప్పు వల్ల... చివరకు ఏమైందో చూడండి..

Updated Date - 2023-07-04T21:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising