Marriage News: నెలలో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి.. కాబోయే భార్య గురించి యువకులు చెప్పింది విని షాక్.. చివరకు వధువు తండ్రికి ఫోన్ చేయడంతో..
ABN, First Publish Date - 2023-05-28T20:03:12+05:30
పెళ్లి చూపుల్లో వారిద్దరికీ ఒకరికొకరు నచ్చడంతో రెండు కుటుంబాల వారూ మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసుకున్నారు. నెలలో పెళ్లి ఉండడంతో ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అంతా ఆనందంగా ఉన్న ఇలాంటి సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. కొందరు..
పెళ్లి చూపుల్లో వారిద్దరికీ ఒకరికొకరు నచ్చడంతో రెండు కుటుంబాల వారూ మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసుకున్నారు. నెలలో పెళ్లి ఉండడంతో ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అంతా ఆనందంగా ఉన్న ఇలాంటి సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు వరుడి వద్దకు వెళ్లారు. కాబోయే భార్య గురించి వాళ్లు చెప్పింది విని సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హాపూర్ జిల్లా గర్‌ముక్తేశ్వర్ పరిధి అథసైని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఖేమచంద్ర అనే వ్యక్తి కుమార్తెకు.. హాపూర్‌లోని దస్తోయ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవ్ అనే యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. దేవ్ టైలరింగ్ పని చేస్తుంటాడు. రెండు కుటుంబాల వారు మాట్లాడుకుని ఇద్దరి వివాహాన్ని జూన్ 27న నిర్వహించేలా మాట్లాడుకున్నారు. పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో ఇరు కుటుంబాల వారు ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కొందరు యువకులు కాబోయే పెళ్లి కొడుకు వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారు దేవ్‌తో ‘‘నువ్వు చేసుకోబోయే అమ్మాయిని నేను ప్రేమించా.. ఈ పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తాం’’.. అని బెదిరించారు.
వారి మాటలకు దేవ్ షాక్ అయ్యాడు. మే 25న వధువు తండ్రికి ఫోన్ చేశాడు. ‘‘ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు’’.. అని చెప్పాడు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లలో ఉన్న వారు ఈ మాటలతో ఆందోళనకు గురయ్యారు. ‘‘ఇంతవరకు వచ్చాక.. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్’’.. అని నిలదీయగా.. అతడు జరిగిన విషయం తెలియజేశాడు. దీంతో చివరకు వధువు తండ్రి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే పోలీసు భద్రత కల్పిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Updated Date - 2023-05-28T20:03:58+05:30 IST