ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంగేజ్మెంట్ రోజే ఓ యువకుడికి ఊహించని షాక్.. సడన్‌గా ఇంటి ముందు ప్రేయసి ఎంట్రీ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-02-02T16:01:27+05:30

వారిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు ఒప్పుకోని యువకుడి తల్లిదండ్రులు.. అతడికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు ఒప్పుకోని యువకుడి తల్లిదండ్రులు.. అతడికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. ఎంగేజ్మెంట్ రోజే యువకుడి ఇంటి ముందు ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. చివరకు ఏమైందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని రోహతా పరిధి సత్వాయి గ్రామానికి చెందిన రింకూ అలియాస్ ఛోటా అనే యువకుడు, తన ఇంటికి సమీపంలోని యువతి (young woman).. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు రింకూ తల్లిదండ్రులు అంగీకరించలేదు. రింకూ వేరే యువతితో నిశ్చితార్థం (Engagement) ఖరారు చేశారు. బుధవారం కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయం రింకూ ప్రియురాలికి తెలిసింది. ఎలాగైనా నిశ్చితార్థాన్ని ఆపాలని నిర్ణయించుకుంది. ఇంట్లో చెప్పకుండా నేరుగా ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో రింకూ కుటుంబ సభ్యులతో పాటూ బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని మృతి.. అనుమానంగానే ఆ తల్లిదండ్రులు కూతురి బ్యాగ్‌ను పరిశీలిస్తే..

ఈ విషయం తెలుసుకున్న రింకూ ప్రియురాలి తల్లిదండ్రులు, సోదరుడు అక్కడికి చేరుకున్నారు. గొడవ చేయకుండా ఇంటికి రావాలంటూ బ్రతిమాలారు. కానీ సదరు యువతి మాత్రం ససేమిరా అంటూ మొండికేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందూ వెనుకా చూడకుండా ఆమె దాడికి (attack) దిగాడు. తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతి సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

మంగళ హారతులతో వధువుకు అత్తారింట్లోకి స్వాగతం.. సడన్‌గా లోపల గదిలో నుంచి అరుపులు, కేకలు.. కంగారుగా వెళ్లి చూడగా...

Updated Date - 2023-02-02T16:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising