Crime News: రెండేళ్ల కూతురు, పక్కింటి యువకుడితో ఫొటో దిగి.. ఏడుస్తున్న ఎమోజీని పెట్టి వాట్సప్ స్టేటస్‌గా పెట్టిన భార్య.. భర్తకు నిజం తెలిసి..
ABN, First Publish Date - 2023-04-10T16:28:50+05:30
భార్య, రెండేళ్ల కూతురితో ఆ భర్త ఎంతో సంతోషంగా ఉండేవాడు. తాను కష్టపడుతూ కుటుంబ సభ్యులకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. అయితే ఇలాంటి ఆనందకర సమయంలో వారి కుటుబంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. భర్తతో సంతోషంగా ఉండాల్సిన భార్య..
భార్య, రెండేళ్ల కూతురితో ఆ భర్త ఎంతో సంతోషంగా ఉండేవాడు. తాను కష్టపడుతూ కుటుంబ సభ్యులకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. అయితే ఇలాంటి ఆనందకర సమయంలో వారి కుటుబంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. భర్తతో సంతోషంగా ఉండాల్సిన భార్య ఓ రోజు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. తన రెండేళ్ల కూతురు, పక్కింటి కుర్రాడితో కలిసి ఉన్న ఫొటోపై ఏడుస్తున్న ఎమోజీ పెట్టింది. అనంతరం ఆ ఫొటోను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంది. చివరకు భర్తకు నిజం తెలియడంతో ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) బార్మర్ జిల్లా సదర్ పరిధి దుగరోన్ కాతాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జగదీష్ అనే వ్యక్తికి భార్య దేబు, రెండేళ్ల కూతురు లలిత ఉన్నారు. జగదీష్ రాజ్‌కోట్‌లోని శీతల పానీయాల ఫ్యాక్టరీలో (factory) పని చేస్తుండేవాడు. దేబు ఇంటి వద్దనే ఉంటూ కూతురు ఆలనాపాలనా చూసుకుంటూ ఉండేది. ఇన్నాళ్లూ దంపతుల (couple) మధ్య ఎలాంటి గొడవలూ తలెత్తలేదు. అయితే ఇటీవల దేబు కారణంగానే వారి ఇంట్లో లేనిపోని సమస్యలు వచ్చిపడ్డాయి. దేబు ఇంటికి ఆమెకు వరుసకు బంధువైన ఖేమారం (22) అనే యువకుడు (young man) తరచూ వస్తూ ఉండేవాడు.
Funny video: మీ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా.. అయితే ఇంటి నుంచి ఇలా ఈజీగా వెళ్లగొట్టండి..
ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది కాస్తా కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. భర్త లేని సమయంలో యువకుడు తరచూ వస్తూ ఉండేవాడు. ఈ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఇటీవల సదరు యువకుడు.. దేబు ఇంటికి ఎక్కువగా వస్తుండేవాడు. ఇటీవల వీరి విషయం భర్తకు తెలిసింది. దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దంటూ గట్టిగా హెచ్చరించాడు. అయినా ఆమె మాత్రం యువకుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో శనివారం ఇద్దరూ ఇంట్లో ఉండగా.. చుట్టు పక్కల వారు గమనించారు. ఈ విషయాన్ని దేబుకు భర్తకు ఫోన్ చేసి చెప్పారు.
భర్త ఇంటికి వస్తే ఏ చేస్తాడో అనే భయంతో దేబూ తీవ్ర ఆందోళనకు గురైంది. చివరకు ప్రియుడితో (boyfriend) కలిసి సంచలన నిర్ణయం తీసుకుంది. కూతురును పక్కన పెట్టుకుని ప్రియుడితో కలిసి ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటోపై ఏడుస్తూ ఉన్న ఎమోజీని పెట్టారు. అనంతరం సదరు ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా (Whatsapp status) పెట్టుకున్నారు. రాత్రి గ్రామ సమీపంలోకి వెళ్లి కూతురు, ప్రియుడితో సహా ముగ్గురూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-10T16:28:50+05:30 IST