Woman Constable: లింగమార్పిడి చేయించుకోవాలనుకున్న మహిళా కానిస్టేబుల్‌కు వింత కష్టం.. న్యాయం కోసం హైకోర్టుకెళ్తే..!
ABN, First Publish Date - 2023-08-23T20:28:11+05:30
కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళకు వింత కష్టం వచ్చి పడింది. ఆమె చూసేందుకు మహిళ అయినా.. లక్షణాల విషయానికొస్తే అన్నీ మగవారివే. దీంతో చివరకు తనని తాను మగాడిలా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని వివరిస్తూ డీజీపీకి లేఖ రాసింది. అయితే..
కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ మహిళకు వింత కష్టం వచ్చి పడింది. ఆమె చూసేందుకు మహిళ అయినా.. లక్షణాల విషయానికొస్తే అన్నీ మగవారివే. దీంతో చివరకు తనని తాను మగాడిలా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని వివరిస్తూ డీజీపీకి లేఖ రాసింది. అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయినా ఆమె తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. ఎలాగైనా మగాడిలా మారాలనే ఉద్దేశంతో చివరకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో (Uttar Pradesh Prayagraj) విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కానిస్టేబుల్‌గా (Female Constable) పని చేస్తున్న మహిళ నేహా సింగ్.. ఇటీవ అలహాబాద్ హైకోర్టును (Allahabad High Court) ఆశ్రయించింది. తాను జెండర్ డిస్ఫోరియా అనే బాధపడుతున్నానని, తనలో అన్నీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయని పిటిషన్‌లో తెలిపింది. తనకు లింగ మార్పడి చికిత్సకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. సదరు మహిళ ఈ ఏడాది మార్చి 11న యూపీ డీడీపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది.
అయితే ఈ అంశంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించింది. నేహా సింగ్ దరఖాస్తుపై విచారించిన న్యాయస్థానం.. ఆధునిక సమాజంలో గుర్తింపును మార్చుకునే హక్కును తిరస్కరించడాన్ని జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సిండ్రోమ్ అంటారని పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ సందర్భంగా కోర్టు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ప్రస్తావించింది. వ్యక్తి గౌరవంలో అంతర్భాగంగా లింగ గుర్తింపును సుప్రీం కోర్టు సమర్థించిందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-08-23T20:28:11+05:30 IST