Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..
ABN, First Publish Date - 2023-01-18T21:07:13+05:30
సెల్ఫీ ఫొటోలు, వీడియోల కోసం కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం..
సెల్ఫీ ఫొటోలు, వీడియోల కోసం కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. భారత రైల్వే.. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ట్రైన్‌లో ఫొటో దిగేందుకు ఓ వ్యక్తి బోగీలోకి వెళ్లాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.
Viral Video: ఇతడి డ్రైవింగ్ స్కిల్స్‌కి నెటిజన్లు ఫిదా.. కారును ఎంత చాకచక్యంగా నడిపాడో చూడండి..
దేశంలో ఇటీవల 8వ వందేభారత్ రైలును (Vande Bharat train) సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రారంభించిన విషయం తెలిసిందే. అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో పాటూ అత్యంత వేగంగా ప్రయాణించే రైలు కావడంతో.. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో చాలా మంది ఈ రైల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి స్టేషన్ వద్ద రైలు ఆగడంతో ఓ వ్యక్తి సెల్ఫీ (Selfie) తీసుకునేందుకు సరదాగా బోగీలోకి వెళ్లాడు. అయితే సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆటోమేటిక్ డోర్లు ఒక్కసారిగా మూసుకున్నాయి. దీంతో అతను కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో తికమక పడుతున్న అతన్ని ఓ టీసీ గుర్తించాడు. జరిగిన విషయం తెలుకున్న అతను సదరు వ్యక్తిని.. తర్వాత ఆగబోయే విజయవాడ స్టేషన్‌లో దిగమని సూచించారు. దీంతో అనుకోని విధంగా అతను సుమారు 150 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-01-18T21:07:17+05:30 IST