Women Crime: వివాహితను పెళ్లిలో చూసి ప్రేమించిన యువకుడు.. ఆమె పుట్టిన రోజున ఇన్‌స్టాలో పెట్టిన ఒకే ఒక పోస్టుతో..
ABN, First Publish Date - 2023-10-14T15:24:52+05:30
కొన్నిసార్లు ఒకే ఒక్క సంఘటన చివరకు జీవితాన్నే మార్చేయవచ్చు. అదేవిధంగా మరికొన్నిసార్లు అదే సంఘటన జీవితాన్ని తలకిందులుగా కూడా చేయొచ్చు. ఇందుకు నిదర్శంగా మన చుట్టూ ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...
కొన్నిసార్లు ఒకే ఒక్క సంఘటన చివరకు జీవితాన్నే మార్చేయవచ్చు. అదేవిధంగా మరికొన్నిసార్లు అదే సంఘటన జీవితాన్ని తలకిందులుగా కూడా చేయొచ్చు. ఇందుకు నిదర్శంగా మన చుట్టూ ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడు వివాహితను పెళ్లిలో చూసి ప్రేమించాడు. చివరకు ఆమె పుట్టినరోజున ఇన్‌స్టాలో పెట్టిన ఒకే ఒక పోస్టుతో ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోరి జైసింగ్‌పురా ఖోర్ పరిధి లాంగ్రీవాస్ గ్రామానికి చెందిన మనీషా(24) అనే యువతికి (young woman) .. జామ్‌డోలి నివాసి జితేంద్ర మీనాతో 2021 నవంబర్‍లో వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇలా సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల ఊహించని సమస్యలు వచ్చి పడ్డాయి. ఇటీవల మనీషా తన బంధువుల పెళ్లికి వెళ్లింది. అక్కడ పురన్ అనే యువకుడు మనీషాను చూశాడు. ఆమెను చూడగానే ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. అప్పటి నుంచి ప్రేమ పేరుతో మనీషాను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. మనీషా మాత్రం అతడిని పట్టించుకోవడం మానేసింది. దీంతో ఎలాగైనా ఆమెను అందరి ముందు నవ్వులపాలు చేయాలనే ఉద్దేశంతో చివరకు సోషల్ మీడియాను (Social media) వాడుకున్నాడు.
జూలై 15న మనీషా పుట్టినరోజు కావడంతో ఆరోజే పురన్ తన కుట్రను అమలు చేశాడు. ఆమె ఫొటోపై ‘‘ఐ లవ్ యూ’’.. అని రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేశాడు. ఈ పోస్టు చూసి మనీషా షాక్ అయి.. పురన్‌కి ఫోన్ చేసింది. ఆ పోస్టును తీసేయమని బ్రతిమాలుకుంది. అయినా పురన్ మాత్రం ఆమె ఫోటోను తొలగించలేదు. దీనికి తోడు చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. విషం తాగి ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 16న మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కూతర్ని పురన్ తరచూ వెంబడిస్తూ వేధించేవాడని, పలుమార్లు కౌన్సెలింగ్ ఇప్పించినా పద్ధతి మార్చుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-10-14T15:24:52+05:30 IST