ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: లక్షల విలువ చేసే కారులోంచి దిగాడు.. పిసినారి బుద్ధిని చూపించి అడ్డంగా దొరికిపోయాడు..!

ABN, First Publish Date - 2023-03-03T19:52:43+05:30

కావాల్సినంత కాసులు ఉన్నా.. కొందరు కక్కుర్తి పనులు చేస్తుంటారు. ఇంకొందరు మరీ దారుణంగా పిసినారి బుద్ధి చూపిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. లక్షల కొద్దీ ఆస్తులు ఉన్నా, ఇవేం చిల్లర పనులయ్యా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కావాల్సినంత కాసులు ఉన్నా.. కొందరు కక్కుర్తి పనులు చేస్తుంటారు. ఇంకొందరు మరీ దారుణంగా పిసినారి బుద్ధి చూపిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. లక్షల కొద్దీ ఆస్తులు ఉన్నా, ఇవేం చిల్లర పనులయ్యా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లక్షల విలువ చేసే కారులోంచి (lakhs of rupees worth car) దిగాడు. పిసినారి బుద్ధిని చూపించి, పట్టపగలు అసలు చేసిన పని చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో లక్షల విలువ చేసే కారులో దిగిన ఇద్దరు వ్యక్తుల వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. గురుగ్రామ్-సహ్రోల్ సరిహద్దు (Gurugram-Sahrol border) వద్ద రోడ్డుపై పట్టపగలు ఓ కారు ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగుతారు. వారి కారు పక్కనే కొన్ని కుండీల్లో పూల మొక్కలు ఉంటాయి. స్థానికంగా జరుగుతున్న G-20 సమ్మిట్‌ కార్యక్రమానికి వస్తున్న విదేశీయులను ఆహ్వానించేందుకు పూల కుండీలను (Flower pots) ఏర్పాటు చేశారు. కారులో దిగిన వ్యక్తుల్లో ఓ వ్యక్తి.. వెనుక డోర్ తీయగా, మరో వ్యక్తి పూల కుండీలను తీసుకుని అందిస్తాడు.

Viral Video: విమానం టేకాఫ్ అయేటప్పుడు వాటిని ఎందుకు ఓపెన్ చేయాలి..? ఈ పైలెట్ చెప్పిన మూడు కారణాలు వింటే..!

మరో వ్యక్తి ఆ కుండీలను కారులో వెనుక భాగంలో నింపేస్తాడు. తర్వాత అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసుకుని తాపీగా వెళ్లిపోతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌లో అత్యంత కాస్ట్‌లీ లిటిల్ ఫ్లవర్ దొంగ అంటూ కొందరు, లక్షల విలువైన కార్లు కొంటారు గానీ.. 100 ఖర్చు చేసి పూలమొక్కలు కొనలేరా అని ఇంకొందరు, ప్రభుత్వ ఆస్తులు, వస్తువులను ఎత్తుకెళ్లడం.. ఇదే మొదటిసారి కాదు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పక్కనున్న వాళ్లు అడిగారు కదా అని డాన్స్ చేసిన నవ వధువు.. అత్తారింట్లో రియాక్షన్ చూసి నెట్టింట కామెంట్స్ ఏంటంటే..!

Updated Date - 2023-03-03T19:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!