OMG: నది ఒడ్డున నిలబడి కాళ్లకు అంటిన మట్టిని కడుక్కుంటుందో మహిళ.. సడన్‌గా షాకింగ్ సీన్.. 20 గంటల తర్వాత..!
ABN, First Publish Date - 2023-08-09T15:06:10+05:30
కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలు అంతులేని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. ఇలాంటి ఘటనలకు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకునే ఘటనలు అంతులేని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. ఇలాంటి ఘటనలకు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విషయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మేకలు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ.. నది ఒడ్డున కాళ్లు కడుక్కుంటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 20 గంటల తర్వాత చివరకు ఏం తెలిసిందంటే..
రాజస్థాన్ (Rajasthan) చిత్తోర్‌గఢ్ జిల్లా గంగ్రార్ పోలీస్ స్టేషన్ పరిధి బిలియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంతిలాల్ భిల్, నారాయణి భిల్ దంపతులు మేకలు మేపుకొంటూ జీవనం సాగించేవారు. ఆదివారం శాంతిలాల్ భార్య నారాయణి మేకలు (goats) మేపేందుకు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో మేకలను గ్రామ సమీపంలోని నది ఒడ్డుకు తోలుకెళ్లింది. మేకలు నీరు తాగుతుండగా.. తాను చేతులు, కాళ్లు కడుక్కునేందుకు నది దగ్గరగా వెళ్లింది. ఈ క్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మహిళ కాళ్లు కడుక్కుంటుండగా ఉన్నట్టుండి నీటిలోంచి బయటికి వచ్చిన ఓ మొసలి (Crocodile attack on woman) ఆమెను లోపలికి లాక్కెళ్లింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.
ఆమెతో పాటూ వచ్చిన మరో ముగ్గురు మహిళలు గమనించి, విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. అంతా కలిసి నది వద్ద వెతికినా నారాయణి కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రెస్క్యూ టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి వెతికినా మహిళ జాడ కనిపించలేదు. చీకటి పడడంతో ఆదివారం ఆపరేషన్ ఆపేయాల్సి వచ్చింది. అయితే సోమవారం మధ్యాహ్నం వరకూ మహిళ జాడ తెలియలేదు. ప్రమాదం జరిగిన 20గంటల తర్వాత ఘటనా స్థలానికి కిలోమీటర్ దూరంలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-08-09T15:06:10+05:30 IST