ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Whatsapp: వాట్సాప్ యూజర్లకు పండగలాంటి వార్త.. ఈ ఒక్క విషయంలో ఉన్న అసంతృప్తి కూడా మాటాష్..!?

ABN, First Publish Date - 2023-07-01T17:14:04+05:30

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తరచూ వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది. సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపడంతో పాటూ ఆడియో, వీడియో కాల్ చేయాలంటే వాట్సాప్‌ తప్పనిసరి అయిపోయింది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కంపెనీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తరచూ వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది. సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపడంతో పాటూ ఆడియో, వీడియో కాల్ చేయాలంటే వాట్సాప్‌ తప్పనిసరి అయిపోయింది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. గతంలో హెచ్‌డీ ఫొటోలను పంపే ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ఆ ఒక్క విషయంలో ఉన్న అసంతృప్తి కూడా తొలగిపోయినట్లే.. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. మరో సరికొత్త ఫీచర్‌తో (New feature) అందుబాటులోకి వస్తోంది. జూన్ మొదటి వారంలో హెచ్‌డీ క్వాలిటీతో (HD quality) ఫొటోలు పంపే సదుపాయాన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాట్సాప్ బీటా అప్‌డేట్‌ 2.23.14.10లో హై క్వాలిటీ వీడియోలను (HD video) పంపే సామర్థ్యాన్ని సైతం పరిచయం చేస్తోంది. వీడియోను పంపే ముందు స్టాండర్డ్, హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంచుకునే వెలుసుబాటు కల్పిస్తున్నారు. డేటా వినియోగం, స్టోరేజ్ స్పేస్ తగ్గించడానికి WhatsApp వీడియోలను కంప్రెస్ చేస్తుంది. అయినా వీడియోలో క్వాలిటీ ఏమాత్రం తగ్గదు.

Doctor Video: డాక్టర్ అంటే ఇలా కదా ఉండాల్సింది.. ఇంజెక్షన్ ఇచ్చినా సరే.. ఆ పాప నవ్వుతూనే ఉంది..!

యూజర్లు హెచ్‌డీ క్వాలిటీ ఆప్షన్‌ను ఉపయోగించి వీడియోను షేర్ చేసినప్పుడు, అది కన్వర్జేషన్‌లో హెచ్‌డీ వీడియోగా లేబుల్ అయి కనిపిస్తుంది. హై క్వాలిటీ ఫొటోల మాదిరిగానే, వీడియో మెసేజ్ బబుల్‌కు ట్యాగ్ ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. ఇది వీడియో మెరుగైన క్వాలిటీతో సెండ్ అయినట్లు సూచిస్తుంది. అయితే, స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా హై క్వాలిటీ వీడియోలను షేర్ చేయడానికి ఈ ఫీచర్ అందుబాటులో లేదు. హై క్వాలిటీ ఫీచర్ ద్వారా మెరుగైన క్వాలిటీతో వీడియోలను షేర్ చేయగల సామర్థ్యం ప్రస్తుతం వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన బీటా టెస్టర్లకు రిలీజ్ అవుతుంది. త్వరలో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..

Updated Date - 2023-07-01T17:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising