ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం.. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. భర్త చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2023-05-12T21:51:52+05:30

కొందరు పైకి మనుషుల్లా కనిపించినా.. వారి ప్రవర్తన మాత్రం మృగాలను తలపిస్తుంటుంది. మరికొందరైతే వయసు, వరుసలు చూసుకోకుండా... మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతుంటారు. ఇలాంటి ప్రభుద్దులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఇటీవల..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పైకి మనుషుల్లా కనిపించినా.. వారి ప్రవర్తన మాత్రం మృగాలను తలపిస్తుంటుంది. మరికొందరైతే వయసు, వరుసలు చూసుకోకుండా... మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతుంటారు. ఇలాంటి ప్రభుద్దులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఇటీవల రాజస్థాన్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం కలిగింది. కాసేపటి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు లోపలికి వెళ్లింది. అక్కడి దృశ్యం చూసి చివరకు షాక్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ (Rajasthan) బరన్ జిల్లా శిష్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దంపతులు (couple) తమ రెండున్నర ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న 30ఏళ్ల వ్యక్తి (30 year old man) వీరికి సమీప బంధువు. దీంతో తరచూ దంపతుల ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల ఇతడి బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు వారికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. తర్వాత చాక్లెట్ కొనిస్తానంటూ వారి కుమార్తెను ఎత్తుకుని బయటికి వెళ్లాడు. సమీపంలో ఉన్న అతడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడి ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో పాటూ తల్లిదండ్రులు, తమ్ముడు తదితరులంతా ఉన్నారు. భార్య (wife) వంట గదిలో బిజీగా ఉంది.

Viral News: పెళ్లి వేదికపై అతిథుల సమక్షంలో వధువు వింత ప్రవర్తన.. ఆమె డిమాండ్స్‌కు వరుడు కూడా మద్దతు ఇవ్వడంతో చివరకు..

కాసేపటి తర్వాత పాపను తన బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. చిన్నారిపై ఉన్నట్టుండి అత్యాచారానికి (Indecent behavior on baby) పాల్పడ్డాడు. ఏడుపు శబ్ధాలు బయటికి వినిపించకుండా ఉండేందుకు.. పాటల సౌండ్‌ని పెంచేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బెడ్‌రూంలో పాటల సౌండ్ ఒక్కసారిగా పెరగడంతో భార్యకు అనుమానం కలిగింది. దీంతో లోపలికి చూడగా చిన్నారి ఏడుస్తూ ఉంది. ఎత్తుకుని ఓదార్చే క్రమంలో రక్తస్రావాన్ని గమనించి భయపడిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరితో మాట్లాడారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Viral Video: బైకులో వెళ్తున్న ప్రేమికులకు.. సడన్ షాక్ ఇచ్చిన స్నేహితులు.. బండిని ఫాలో అవుతూ చివరకు వీరు చేసిన పని..

Updated Date - 2023-05-12T21:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising