కాసేపట్లో పెళ్లనగా ఫోన్‌కాల్.. వధువు చెప్పిన సమాధానం విని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-03-16T21:13:54+05:30
ఆ యువతికి ఏడాది క్రితం ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్తే కావడంతో అప్పటి నుంచి అతడితో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల వారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అతిథులంతా వధువు గ్రామానికి చేరుకున్నారు. కాసేపట్లో..
ఆ యువతికి ఏడాది క్రితం ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్తే కావడంతో అప్పటి నుంచి అతడితో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల వారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అతిథులంతా వధువు గ్రామానికి చేరుకున్నారు. కాసేపట్లో పెళ్లి అనగా.. వధువుకు వరుడు ఫోన్ చేశాడు. చివరకు వధువు చెప్పిన సమాధానం విని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కౌశాంబి జిల్లా పరిధి మజ్రా చందనాపూర్‌కు చెందిన శివలోచన్ అనే వ్యక్తి కూతురు వందనకు ప్రయాగరాజ్ పరిధి ధూమన్‌గంజ్‌కు చెందిన పంకజ్‌తో ఏడాది క్రితం వివాహం (marriage) నిశ్చయించారు. కాబోయే భర్త కావడంతో వందన తరచూ పంకజ్‌తో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో బుధవారం వారి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. మంగళవారం వరుడు ఊరేగింపుగా (Wedding procession) వధువు గ్రామానికి రావాల్సి ఉంది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. అతిథులు, సన్నిహితులు, స్నేహితులతో గ్రామం సందడి సందడిగా ఉంది. మరోవైపు వధూవరుల ఊరేగింపు కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో వధువుకు వరుడు ఫోన్ చేశాడు.
పెళ్లి ఖరారు చేసుకున్న సమయంలో మాట్లాడిన కట్నం విషయం గురించి ప్రస్తావించాడు. దీనిపై తనకు ఏమీ తెలియదని వధువు తెలియజేసింది. దీంతో ఆగ్రహానికి గురైన వరుడు పెళ్లికి నిరాకరించాడు. ‘‘నీ కోసం మీ నాన్న మంచి అబ్బాయిని తెస్తాడులే.. నన్ను మర్చిపో’’.. అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయం తెలియడంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. చివరకు గ్రామ పెద్దలు కలుగజేసుకుని ఇరు వైపు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. వివాహం నిశ్చయం చేసుకున్న సమయంలో కట్నం (dowry) లేకుండా చేసుకుంటానని, ఇప్పుడు మత్రం మాట మారుస్తున్నారని వధువు తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లికి అంగీకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకూ ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-03-16T21:13:54+05:30 IST