Richest Royal Family of World: ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిదో తెలుసా..? బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ మాత్రం కాదండోయ్..!
ABN, First Publish Date - 2023-05-12T11:05:22+05:30
ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిది?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిది? అనే ప్రశ్న మీకు చాలాసార్లు వచ్చే ఉంటది. ఇక కొంచెం తెలిసిన వారైతే టక్కున చెప్పేది బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ పేరు. అయితే, తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఇంగ్లండ్ రాజకుటుంబం కాదని తెలుస్తోంది. బ్రిటీష్ రాజకుటుంబం అపారమైన సంపద, భారీ నికర విలువ కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అత్యంత ధనిక రాజకుటుంబం కాదట. మధ్యప్రాచ్య దేశాల రాజకుటుంబాలే వరల్డ్‌లో అత్యంత ధనిక రాజకుటుంబాలుగా తెలిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ (Royal Family of Saudi Arabia). సౌదీ రాజకుటుంబం విలువ 1.4 లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల కంటే కూడా ఎక్కువే. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15వేల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారట.
కాగా, వారి సంపదలో అధిక మొత్తం దేశంలోని అతిపెద్ద చమురు క్షేత్రాల నుండి వస్తుంది. సౌదీ కింగ్ ప్రస్తుతం అల్ యమామా ప్యాలెస్ అని పిలవబడే విలాసవంతమైన 4 మిలియన్ చదరపు అడుగుల రాజభవనంలో నివసిస్తున్నారు. విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లు, బోట్స్, బంగారు పూతతో కూడిన కార్లతో పాటు ఇతర ఖరీదైన వాహనాలను కలిగి ఉంది. ఇక సౌదీ రాయల్ ఫ్యామిలీ తర్వాత కువైత్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనిక రాజకుటుంబాన్ని కలిగి ఉంది. ఆ దేశ రాజకుటుంబం మొత్తం నికర ఆస్తుల విలువ 360 బిలియన్ డాలర్లు (రూ.2,95,39,98,00,00,000). ఇకపోతే కింగ్ చార్లెస్-3 నేతృత్వంలోని బ్రిటీష్ రాజకుటుంబం మాత్రం 88 బిలియన్ డాలర్ల (రూ.7.22లక్షల కోట్లు) ఆస్తులతో వరల్డ్‌లో 5వ అత్యంత ధనిక రాజకుటుంబంగా ఉంది.
Bride: బుల్లెట్ బండిపై వధువు గ్రాండ్ ఎంట్రీ.. పెళ్లికి వచ్చిన వారంతా పరేషాన్.. వైరల్ వీడియో!
Updated Date - 2023-05-12T11:05:49+05:30 IST