Funny Video: ``మళ్లీ నువ్వెందుకు లైన్లోకి వచ్చావ్``.. కంప్యూటర్ వాయిస్‌తో ఈ బామ్మ మాటలు వింటే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..
ABN, First Publish Date - 2023-07-16T16:58:24+05:30
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా నవ్విస్తోంది. ఆ వీడియోలో ఓ బామ్మ మొబైల్లో వినిపించే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్‌కు క్లాస్ పీకుతోంది. ఆ సమయంలో ఆ బామ్మ మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తున్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Funny Video) సోషల్ మీడియా జనాలను విపరీతంగా నవ్విస్తోంది. ఆ వీడియోలో ఓ బామ్మ (Old Woman) మొబైల్లో వినిపించే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ (Computer generated voice)కు క్లాస్ పీకుతోంది. ఆ సమయంలో ఆ బామ్మ మాటలు చాలా మందికి నవ్వు తెప్పిస్తున్నాయి. సాధారణంగా మనం ఫోన్ చేసిన వ్యక్తి బిజీగా ఉంటే.. ``మీరు కాల్ చేసిన వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదని`` ఓ వాయిస్ వినిపిస్తుంది. ఆ బామ్మకు ఆ వాయిస్ చిరాకు తెప్పించింది.
IPS అధికారి Rahul Prakash ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ``చాట్‌బాట్ సోదరా.. జాగ్రత్తగా ఉండండి. ఇండియాకు రండి. ఈ బామ్మ మిమ్మల్ని కూడా వదలదు`` అంటూ కామెంట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో హర్యానాకు చెందిన ఓ బామ్మ ఫోన్ పట్టుకుని కూర్చుంది. ఎవరికో ఫోన్ చేస్తోంది. ఎంతసేపు రింగ్ అయినా అవతలి వ్యక్తి ఫోన్ తీయలేదు. ఆ తర్వాత కంప్యూటర్ జనరేట్ వాయిస్ వస్తోంది. అమ్మాయి వాయిస్ వినబడడంతో ఆ బామ్మ సహనం కోల్పోయి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: తల్లి ప్రేమ అంటే అంతే.. పిల్లల కోసం ప్రాణాలకు తెగించి పాముతో పోరాడిన కుందేలు.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.3 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ బామ్మకు ఏ టెక్నాలజీ అయినా భయపడాల్సిందే``, ``ఆ బామ్మ స్టైల్, స్వాగ్ అమోఘం``, ``పాపం.. కంప్యూటర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-07-16T16:58:24+05:30 IST