Water tank shape: వాటర్ ట్యాంకు అలా లేకపోతే కొంప మునిగిపోయి... కట్టలు తెంచుకుంటుందట!
ABN, First Publish Date - 2023-03-21T08:29:40+05:30
Water tank shape: భవనాలపై ఉండే ఏ వాటర్ ట్యాంక్ చూసినా దాని ఆకారం(shape) గుండ్రంగానే ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఇలా ఎందుకు ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికిగల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Water tank shape: భవనాలపై ఉండే ఏ వాటర్ ట్యాంక్ చూసినా దాని ఆకారం(shape) గుండ్రంగానే ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఇలా ఎందుకు ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికిగల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండ్రని ఆకారమే కాదు.. వాటిపై కనిపించే స్ట్రిప్స్(strips) కూడా ప్రత్యేక పనితీరును కలిగి ఉంటాయి. నీటి ట్యాంక్‌కు ఈ ఆకృతిని అది చాలా కాలం పాటు సురక్షితం(safe)గా ఉండేందుకు సహకరిస్తుంది. వాస్తవానికి ఏదైనా లోతైన వస్తువులో నీరు నిండినప్పుడు, అన్ని వైపుల నుండి ఒత్తిడి ఏర్పడుతుంది.
ఈ ఒత్తిడి కారణంగా అది పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి(pressure) పెరగడం కారణంగా ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. సైన్స్ తెలిపిన వివరాల ప్రకారం వాటర్ ట్యాంకు అనేది చదరపు ఆకారంలో ఉంటే ట్యాంక్ ప్రతి మూలలో ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ట్యాంకు మూలలు త్వరగా పగిలిపోతాయి. అయితే స్థూపాకారం(Cylindrical)లో అంటే పొడవైన గుండ్రని ఆకారంలో ఉంటే ఈ ఒత్తిడి అంతా ఉపరితలంపైకి సులభంగా పంపిణీ అవుతుంది. అందుకే ట్యాంక్‌ను గుండ్రని ఆకారంలో రూపొందిస్తారు.
ట్యాంక్‌పై కనిపించే లైన్లు ట్యాంక్‌ను బలోపేతం చేయడానికి, వేసవిలో ఉష్ణోగ్రత(temperature) పెరిగినప్పుడు ట్యాంక్ విస్తరించకుండా నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇది కాకుండా ఈ లైన్లు ట్యాంకుపై ఒత్తిడిని నియంత్రించడం(controlling)లో సహాయపడతాయి. ట్యాంక్‌ను ఫ్లాట్‌గా తీర్చిదిద్దితే, అది త్వరగా దెబ్బతినే అవకాశం(chance) ఏర్పడుతుంది. ట్యాంకుపై కనిపించే ఈ లైన్లు ట్యాంక్‌కు ఒత్తిడిని తట్టుకోవడంలో సహాయపడతాయి.
Updated Date - 2023-03-21T10:16:51+05:30 IST