ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife and Husband: కారులో కూర్చుని భార్య పాట పాడుతోంటే.. ఈ భర్త చేసిన నిర్వాకమేంటో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

ABN, First Publish Date - 2023-09-20T13:27:50+05:30

కారులో కూర్చుని భార్య పాటలు పాడుతోంటే ఆమె భర్త చేసిన పని నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన పలువురు తమ భార్యలకు ఇన్ డైరెక్టుగా..

సోషల్ మీడియాలో చాలావరకు భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు, వాటికి సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ భార్యాభర్తలు సరదగా ఉండే సంఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి సరదా వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. కారులో కూర్చుని భార్య పాటలు పాడుతోంటే ఆమె భర్త చేసిన పని నెటిజన్లను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన పలువురు తమ భార్యలకు ఇన్ డైరెక్టుగా పంచ్ వేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

ఒకప్పుడు భార్యాభర్తల(husband, wife) మధ్య గంభీరమైన వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అర్థం చేసుకునే జంటలు చాలా వరకు భార్యాభర్తలు అనేకంటే స్నేహితులుగా ఉంటున్నారు అని చెప్పవచ్చు. వీడియోలో మొదటగా ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఇతని పేరు రోహిత్ శర్మ. 'నిజానికి నాభార్య ఎలా పాడుతుందంటే' అని భార్య వైపుకు కెమెరా తిప్పుతాడు. కార్ లో పెట్టిన మ్యూజిక్ సిస్టమ్ నుండి పాట ప్లే అవుతోంది. అతని భార్య ఆ పాటను ఎంజాయ్ చేస్తూ తానూ అందులో లీనమైపోయి పాట పాడుతోంది. కానీ ఆమె భర్త ఒక్కసారిగా మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ చేశాడు. అంతే పాట ఒక్కసారిగా ఆగిపోయే సరికి ఆమె తరువాత లిరిక్స్ వెతుక్కుంటున్నట్టు అయోమయంగా పాడటం ఆపేస్తుంది. ఆ తరువాత మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ చేసిన భర్తవైపు గుర్రుగా చూస్తుంది. అతను అదంతా వీడియో తీస్తున్నాడని గమనించగానే ఆమె తన తల పట్టుకుంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూడగానే ఆమె భర్త గట్టిగా నవ్వడంతో ఈ వీడియో ముగుస్తుంది.

Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!



ఈ వీడియోను రోహిత్ శర్మ అనే వ్యక్తి rohiiits తన ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'వదినగారు పాటకు ట్యూన్ లు పెట్టారా?' అని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. మరికొందరు తమ తమ భార్యల పాటల ప్రయోగాలను గుర్తుచేసుకున్నారు. ఇంకొందరు ఆ మహిళ సింగింగ్ స్కిల్స్ ను ప్రస్తావిస్తూ ఎగతాళి చేస్తున్నారు.

Job Notification: వీళ్లకు కావాల్సింది ఉద్యోగులు కాదు.. బానిసలు అంటూ నెటిజన్ల ఆగ్రహం.. ఆ కంపెనీ జాబ్ ప్రకటన చూసి..!


Updated Date - 2023-09-20T13:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising