ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి ఖంగుతిన్నాడు..

ABN, First Publish Date - 2023-11-30T21:42:54+05:30

దంపతుల మధ్య నిత్యం అనేక రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఒకరిపై ఇంకొకరు అనుమానం పెంచుకోవడం వల్లే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. ఈ కారణంగా...

దంపతుల మధ్య నిత్యం అనేక రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఒకరిపై ఇంకొకరు అనుమానం పెంచుకోవడం వల్లే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. ఈ కారణంగా ఎంతో మంది మహిళలు నిత్యం చిత్రహింసలకు గురవుతుంటారు. అలాగే కొన్నిసార్లు భార్యల కారణంగా భర్తలు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ జంటకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంటికి ఆలస్యంగా వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి చివరకు ఖంగుతిన్నాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంటికి ఆసల్యంగా వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తలపై ఉన్న హెల్మెట్ తీసి.. విశ్రాంతి తీసుకుందామని ప్రయత్నించేలోగానే ఊహించని ఘటన చోటు చేసుకుంది. లోపలి నుంచి భార్య వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా (Wife assaults husband) అతడిపై దాడికి దిగుతుంది. ‘‘ఇంటికి ఇంత ఆలస్యంగా వస్తాయా.. ఇంతసేపూ ఎక్కడికి వెళ్లావ్’’.. అంటూ గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే ఉంటుంది. భార్య చేసిన పనికి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆమె అంతలా కొడుతున్నా.. పల్లెత్తుమాట కూడా అనకుండా అలాగే నిల్చుండిపోతాడు.

Bride Video: కుమిలి కుమిలి ఏడుస్తూనే.. అత్తారింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వధువు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..!

భర్తను చితకబాదిన ఆమె.. కాసేపటికి శాంతిస్తుంది. ‘‘ఇంకోసారి ఆలస్యంగా వచ్చావో.. నీ అంతు చూస్తా’’.. అని బెదిరిస్తూ లోపలికి వెళ్లిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంట్లోని పోరు ఇంతింతకాదయా’’.. అంటూ కొందరు, ‘‘ముందే కెమెరా ఏర్పాటు చేసి, భార్య దారుణాన్ని బయటపెట్టాడు’’.. అంటూ మరికొందరు, ‘‘చాలా మంది భర్తలు ఇలాంటి సమస్యే ఉంది.. అయితే బయటికి చెప్పుకోరు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో యువతి వద్ద యువకుడి వింత నిర్వాకం.. చివరకు ఇద్దరూ కలిసి చేసిన పనికి ప్రయాణికులు షాక్..

Updated Date - 2023-11-30T21:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising