ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: నేను ఓ అమ్మాయిని ప్రేమించాను.. నువ్వు ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకుంటా.. భార్య ముందు ఓ భర్త ప్రపోజల్.. ఆమె సరేనంది కానీ..!

ABN, First Publish Date - 2023-04-19T22:07:22+05:30

'నేను ఓ అమ్మాయిని ప్రేమించాను, నువ్వొప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను' అని భార్యను అడిగాడొక వ్యక్తి. పాపం తన భర్త ఎంతో నిజాయిగా అడుగుతున్నాడని అనిపించిందో.. లేక అతని ఇష్టాన్ని కాదనకూడదని అనిపించిందో కానీ ఆ భార్య అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ, పెళ్ళి ఒక్కరితో గడిచిపోతున్న కాలం కాదిది. భార్యలకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టే మగాళ్లున్న ఈ కాలంలో 'నేను ఓ అమ్మాయిని ప్రేమించాను, నువ్వొప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను' అని భార్యను అడిగాడొక వ్యక్తి. పాపం తన భర్త ఎంతో నిజాయిగా అడుగుతున్నాడని అనిపించిందో.. లేక అతని ఇష్టాన్ని కాదనకూడదని అనిపించిందో కానీ ఆ భార్య అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భార్య సరే.. అనడంతో ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు అతను. కానీ కొన్నిరోజులకే షాకింగ్ స్విస్ట్ తగిలింది అతనికి. అందరికీ విడ్డూరంగా అనిపిస్తున్న ఈ సంఘటన గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) కు చెందిన రాజేష్ అనే వ్యక్తి జలంధర్(Jalandhar) లో పండ్ల వ్యాపారం చేసేవాడు. అక్కడ వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో పనికోసం ఢిల్లీకి(Delhi) వెళ్లాడు. అక్కడ అతను నివసిస్తున్న గదికి కొద్ది దూరంలో గుడియా అనే అమ్మాయి కూడా నివసించేది. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ఒకే గదిలో లివ్ ఇన్ రిలేషన్(live in relation) లో ఉండేవారు. అయితే రాజేష్ కు గతంలోనే పెళ్ళి అయింది, ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం గుడియాకు కూడా చెప్పాడు. అంతా తెలిసి గుడియా అతనితో జీవితం పంచుకోవడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో రాజేష్ జలంధర్ కు వెళ్లి తన భార్యను కలిసి 'నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాలుగు నెలల నుండి ఆమెతో కలసి ఉంటున్నాను, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను' అని అడిగాడు. అప్పటికే అంతా జరిగిపోయిందని, తాను కాదు అన్నంత మాత్రాన అతను గుడియాకు దూరంగా ఉంటాడనే నమ్మకం లేక రాజేష్ భార్య వారి పెళ్ళికి ఒప్పుకుంది. భార్య ఒప్పుకోవడంతో రాజేష్ గుడియాతో కలసి ఢిల్లీ నుండి జలంధర్ కు పారిపోయి వచ్చాడు. జలంధర్ లో గుడియాను వివాహం చేసుకున్నాడు.

Wife: కన్న తల్లి గురించి ఓ షాకింగ్ నిజాన్ని పక్కింటికి వెళ్లి మరీ చెప్పిన 9 ఏళ్ల కొడుకు.. అనుమానంగానే వాళ్లంతా ఇంట్లోకి వెళ్లి చూస్తే..


రాజేష్ గుడియాను వివాహం చేసుకున్న విషయం గుడియా తండ్రికి తెలిసింది. అప్పటికే పెళ్ళైన వ్యక్తి తన కూతురిని ప్రేమ పేరుతో మాయ చేశాడని అనుకున్నాడు. అమాయకురాలైన తన కూతురిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడనే కారణంతో గుడియా తండ్రి జలంధర్ కు గూండాలను తీసుకొచ్చాడు. గుండాలతో రాజేష్ ను చితక్కొట్టించాడు. రాజేష్ భార్య, గుడియా ఇద్దరూ సర్దకుపోతామని చెప్పినా గుడియా తండ్రి మాత్రం తన కూతురు పెళ్లైన వ్యక్తితో ఉండటానికి అంగీకరించలేదు.

Cool Water: ఎండ నుండి ఇంటికి రాగానే చల్లనీళ్లు గడగడా తాగేస్తున్నారా? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే..


Updated Date - 2023-04-19T22:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising