Wife: వర్షం రాకపోయి ఉంటే.. భర్తను భార్యే చంపిందన్న నిజం బయటపడేదే కాదేమో.. మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి..!
ABN, First Publish Date - 2023-11-13T16:06:52+05:30
ఓ భార్య తన భర్తను చంపేసి రెండు ముక్కలుగా చేసి మరీ అతన్ని మాయం చేయాలని చూసింది. కానీ..
భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. కానీ ఇప్పటికాలంలో అక్రమసంబంధాల కారణంగా భార్యభర్తల బంధానికి బీటలు పడుతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో పడి భాగస్వాములు ఒకరినొకరు అంతం చేసుకునే దిశగా వెళుతున్నారంటే దీని ప్రభావం ప్రజల మీద ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. ప్రతిరోజూ వార్తలలో భార్యను చంపిన భర్త అని, భర్తను అంతం చేసిన భార్య అని చూస్తూనే ఉంటాం. ఇది కూడా అలాంటి సంఘటనే. ఓ భార్య తన భర్తను చంపేసి రెండు ముక్కలుగా చేసి మరీ అతన్ని హత్య చేసిన విషయం బయటపడకుండా కవర్ చేసింది. కానీ వర్షం కారణంగా ఆమె చేసిన పని గుట్టు రట్టయ్యింది. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు(Tamil Nadu)లోని తిరుచ్చిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తిరుచ్చిలో పూల వ్యాపారం చేసే ప్రభు అనే వ్యక్తికి 30ఏళ్లు. ఇతనికి వినోదిని అనే మహిళతో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె వయసు 26ఏళ్లు. వీరికి ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నారు. వినోదినికి 23ఏళ్ళ భరత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. వారి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. వినోదిని భరత్ తో కలసి మూడు నెలల కిందట సంధాయ్ గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. వారిద్దరూ అక్కడ రహస్యంగా కలిసేవారు. ఈ విషయం అనుకోకుండా ప్రభుకు తెలియంతో అతను వినోదిని వారించాడు. భరత్ తో సంబంధం వదిలిపెట్టాలని చెప్పాడు. అలా చెప్పిన తరువాత వారు ఉన్న ఇల్లు వదిలి వేరే ఇంట్లో అద్దెకు చేరాడు. ఈ సంఘటన జరిగిన తరువాత వినోదిని భరత్ ను 10రోజుల పాటు అస్సలు కలవలేకపోయింది. దీంతో భర్తమీద కోపం పెంచుకుంది. తన సంతోషానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భరత్ తో కలసి తన భర్త ప్రభును అంతం చేయాలని నిర్ణయించుకుంది.
ఇది కూడా చదవండి: Marriage: సారీ.. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయను.. ఈ ఒక్క మాట చెప్పాక ఆ తల్లి ప్రాణాలతో లేదు.. అసలేం జరిగిందంటే..!
తన భర్తను అంతం చేయడానికి తను ప్రేమించిన భరత్ తో పాటు భరత్ స్నేహితుల సహాయం తీసుకుంది. వారి ప్లాన్ లో భాగంగా వినోదిని ప్రభుకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఆ తరువాత భరత్ సహాయంతో గొంతు పిసికి భర్తను హత్య చేసింది(Wife killed husband). మృతదేహాన్ని భరత్ స్నేహితుల సహాయంతో తీసుకెళ్ళి తిరుచ్చి-మదురై హైవే సమీపంలో తగలబెట్టాలని చూశారు. అయితే వర్షం రావడంతో తగలబెట్టలేకపోయారు. ఆ తరువాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి మొండెంను కావేవి నదిలో, మిగిలిన భాగాన్ని కొల్లిడం నదిలో విసిరేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు మిన్నకుండిపోయారు. కొన్నిరోజులు తరువాత ప్రభు తమ్ముడు తన అన్నను చూడటానికి ఇంటికెళ్లాడు. ప్రభు ఇంటికి రాలేదని, ఇప్పటికి 10రోజులు అయ్యిందని వినోదిని ప్రభు తమ్ముడితో చెప్పింది. అతను ఊరంతా వెతికి ప్రభు జాడ తెలియకపోయేసరికి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో భాగంగా వినోదని, ఆమె ప్రియుడు భరత్ చేసిన హత్య ఉదంతం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు విచారణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!
Updated Date - 2023-11-13T16:06:55+05:30 IST