Viral Video: అయ్యో.. ఆంటీ.. ఇలా జరిగిందేంటి..? ఆ పెళ్లి జంటను వీడియో తీయాలనుకోవడమే ఈమె చేసిన పొరపాటయింది..!
ABN, First Publish Date - 2023-02-25T18:27:00+05:30
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చాలా మంది ఏ పనిలో ఉన్నా.. సెల్ఫీలు, వీడియోలు (Selfie videos) తీసుకోవడం మాత్రం విధిగా చేస్తుంటారు. ప్రతి క్షణాన్ని తమ ఫోన్లలో వివిధ కోణాల్లో వీడియోలు తీయడం, చివరకు వారి ప్రతిభను అంతా జోడించి దాన్ని..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చాలా మంది ఏ పనిలో ఉన్నా.. సెల్ఫీలు, వీడియోలు (Selfie videos) తీసుకోవడం మాత్రం విధిగా చేస్తుంటారు. ప్రతి క్షణాన్ని తమ ఫోన్లలో వివిధ కోణాల్లో వీడియోలో బంధించడం, చివరకు వారి ప్రతిభను అంతా జోడించి దాన్ని వినూత్నంగా ఎడిట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇక శుభకార్యాల సమయంలో ఎవరి ఫోన్ చూసినా.. వీడియో మోడ్ ఆన్ అయి ఉంటుంది. ఎడాపెడా ఫొటోలు, వీడియోలు తీసేసి.. సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో ఓ మహిళ వీడియో తీస్తుండగా... సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వధూవరులు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం (Christian weddings) చేసుకుంటూ ఉంటారు. వివాహానంతరం బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో బయటికి వస్తుంటారు. ఓ కెమెరామెన్ ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తుంటారు. అయితే పక్కనే ఉన్న ఓ మహిళ.. తన ఫోన్‌లో ఈ దృశ్యాలను బంధించేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటుంది. వధూవరులను (bride and groom) వీడియో తీస్తూనే వెనక్కు వెనక్కు నడుస్తూ ఉంటుంది. అయితే బయటికి వచ్చాక.. పక్కనే కాలువ ఉంటుందనే విషయం ఆమెకు తెలీదు. అలా తీస్తూనే వెనక్కు వచ్చే క్రమంలో కాలు జారి ధబేల్‌మని (woman fell into canal) కాలువలో పడిపోతుంది.
ఆ సమయంలో వధూవరుల పక్కనే ఉన్న మరో మహిళ ఒక్కటి.. అయ్యయ్యో! ఎంత పని జరిగింది.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. అయితే కాలువలో పడ్డ మహిళకు చెందిన ఫోన్, పర్సు మాత్రం ఒడ్డున పడతాయి. పక్కనే ఉన్న యువకులు వెంటనే స్పందించి ఆమెను పైకి లాగుతారు. అయితే ఇంత జరుగుతున్నా.. వధూవరుల్లో ఏమాత్రం టెన్షన్ కనపడదు. ‘‘ఇలా పడిందేంటీ’’.. అన్నట్లుగా వరుడు ఇలా చేయి చూపి.. అలా తన దారిన తాను వెళ్లిపోతాడు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
పెళ్లి తర్వాత ఇలాగే జరగాలంటూ వధువు వింత కోరిక.. వరుడి తండ్రి కూడా ఒప్పుకోవడంతో.. చివరకు అంతా కలిసి..
Updated Date - 2023-02-25T18:28:52+05:30 IST