ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు బయటకొచ్చిన దూది ఉండలు.. భయంతో ఆస్పత్రికి వెళ్తే వెలుగులోకి అసలు నిజం..!

ABN, First Publish Date - 2023-06-15T11:16:45+05:30

కేరళలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సీజెరియన్ (Cesarean) కోసం వచ్చిన మహిళ విషయంలో వైద్యులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కేరళలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సీజెరియన్ (Cesarean) కోసం వచ్చిన మహిళ విషయంలో వైద్యులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. దాంతో ప్రస్తుతం బాధిత మహిళ పరిస్థితి ఘోరంగా మారింది. ఆస్పత్రి నిర్వాకంపై ఆరోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా పరిపాలన విభాగానికి ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పలక్కడ్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 9న కాన్పు కోసం ఈదతరాకు చెందిన షబానా అనే మహిళ చేరింది. దాంతో ఆ తర్వాతి రోజు ఆస్పత్రి వైద్యులు ఆమెకు సీజెరియన్ చేశారు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాతి నుంచి ఆమెకు పొత్తికడుపులో నొప్పి మొదలైంది.

ఈ క్రమంలో మంగళవారం బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు దూది ఉండలు బయటకొచ్చాయి. దాంతో భయపడిన షబానా వెంటనే తనకు సీజెరియన్ నిర్వహించిన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అసలు విషయం చెప్పారు. సీజెరియన్ సమయంలో పొట్టలోనే దూది మరిచిపోయినట్లు తాపీగా సెలవిచ్చారు. దాంతో వైద్యుల నిర్లక్ష్యంపట్ల షబాబా కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. అనంతరం ఈ విషయమై బాధితురాలు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా పరిపాలన విభాగానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఆస్పత్రి యాజమాన్యాన్ని షబానా చికిత్స తాలూకు రికార్డులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

Viral Video: చిన్నారీ.. నీకు హ్యాట్సాఫ్ తల్లీ.. ఓ కాలు లేకున్నా పరుగు పోటీల బరిలోకి దిగి.. ఓడిపోయానని తెలిసినా కూడా..!


Updated Date - 2023-06-15T11:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising