ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నడిరోడ్డుపై తుపాకీతో మహిళ హల్‌చల్.. భయంతో వణికిపోయిన వాహనదారులు.. చివరికి

ABN, First Publish Date - 2023-08-17T13:00:58+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) గొప్పదనం గురించి ఎంత చెప్పిన తక్కువే. కానీ అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. పని మీద బయటకు వెళ్లినా, విహార యాత్రలు చేసినా ఇంటికెళ్లే వరకూ బిక్కుబిక్కుమంటూనే గడుపుతారు.

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా (America) గొప్పదనం గురించి ఎంత చెప్పిన తక్కువే. కానీ అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. పని మీద బయటకు వెళ్లినా, విహార యాత్రలు చేసినా ఇంటికెళ్లే వరకూ బిక్కుబిక్కుమంటూనే గడుపుతారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియక ప్రతిక్షణం భయంభయంగానే గడుపుతుంటారు. దీనికి ప్రధాన కారణం అక్కడి గన్‌ కల్చర్‌ (Gun Culture). దేశ పౌరులకు తుపాకీ వినియోగించడంలో పూర్తి స్వేచ్ఛ ఉండడంతో ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట కాల్పుల ఘటనలు వెలుగు చూస్తుంటాయి. ఇటీవల కాలంలోనైతే వరుసగా యూఎస్‌లో కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే కోవలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై ఓ మహిళ గన్‌తో హల్‌చల్ చేసింది. రోడ్డు దాటుతూ వాహనదారులపై తుపాకీ గురిపెట్టింది. ఆ తర్వాత తనను తాను అదే గన్‌ను ఎక్కుపెట్టుకుని అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌ (New York) లోని నసౌ కౌంటీలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ గన్‌తో రోడ్డుపై హల్‌చల్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న తుపాకీతో వాహనదారులపై గురిపెట్టి రోడ్డు దాటుతోంది. ఒకసారి గాల్లో కాల్పులు కూడా జరిపింది. అలా కొద్దిదూరం వెళ్లాక.. అదే గన్‌ను తనకు తానుగా ఎక్కుపెట్టుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమ వాహనం మొదట ఆమెను కింద పడేశారు. అలా ఆమె కిందపడిపోయిన వెంటనే పోలీసులు ఆమెను చుట్టుముట్టారు.

Shocking Video: షాకింగ్ ఘటన.. భుజంపై చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న తండ్రిని పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్చిన దుండగులు..!


మహిళ చేతుల్లోంచి దూరంగా పడిపోయిన తుపాకీ (Gun) ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ వెంటనే ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చాకచక్యంగా మహిళను అరెస్ట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఈ ఘటనలో సదరు మహిళ స్వల్పంగా గాయపడింది. దాంతో వెంటనే ఆమెను చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె వింత ప్రవర్తనపై నసౌ కౌంటీ పోలీసులు (Nassau County Police) దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. అయితే, మహిళను పోలీసులు చాలా నేర్పుగా అరెస్ట్ చేయడం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Updated Date - 2023-08-17T13:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising