కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఒక చేతిలో బిడ్డ.. మరో చేత్తో రిక్షా హ్యాండిల్.. తల్లిప్రేమకు అసలు సిసలు అర్థం..!

ABN, First Publish Date - 2023-07-06T19:13:44+05:30

సృష్టిలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే అని చెప్పొచ్చు. వివాహమైన తర్వాత ప్రతి స్త్రీ.. అమ్మా అని పిలింపించుకోవాలని ఆశపడుతుంది. సంతానం కలిగిన తర్వాత వారే తన ప్రపంచంగా.. పిల్లల ఇష్టమే తన ఇష్టంగా బతుకుతుంది. వారికి..

Viral Video: ఒక చేతిలో బిడ్డ.. మరో చేత్తో రిక్షా హ్యాండిల్.. తల్లిప్రేమకు అసలు సిసలు అర్థం..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సృష్టిలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే అని చెప్పొచ్చు. వివాహమైన తర్వాత ప్రతి స్త్రీ.. అమ్మా అని పిలింపించుకోవాలని ఆశపడుతుంది. సంతానం కలిగిన తర్వాత వారే తన ప్రపంచంగా.. పిల్లల ఇష్టమే తన ఇష్టంగా బతుకుతుంది. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. పిల్లలపై తల్లి ప్రేమ ఎలా ఉంటుందనేందుకు సాక్ష్యంగా నిత్యం మన కళ్లముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ తల్లీబిడ్డకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒక చేతిలో బిడ్డను ఎత్తుకుని.. మరో చేత్తో రిక్షా నడపడం చూసి నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లిప్రేమకు అసలు సిసలు అర్థం ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపైకి ఓ ఈ-రిక్షా (E-Rickshaw) వచ్చి ఆగుతుంది. దాన్ని ఓ మహిళ నడపడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతలోనే వారికి మరో దృశ్యం కనిపించింది. ఓ చేత్తో బిడ్డను పట్టుకుని, మరో చేత్తో రిక్షా హ్యాండిల్ పట్టుకుని (woman driving rickshaw carrying child) ఉండడం చూసి అంతా అలానే చూస్తుండిపోయారు. ప్రయాణికులను ఎక్కించుకున్న మహిళ.. ఓ వైపు బిడ్డను లాలిస్తూనే మరో వైపు రిక్షాను నడుపుతూ వెళ్లిపోయింది.

Tip Controversy: ఇంత లగ్జరీ ఇంట్లో ఉంటూ ఇంత చీప్‌గా టిప్ ఇస్తావా..? ఓ డెలివరీ బాయ్ మాటలకు విస్తుపోయిన మహిళ.. చివరకు..!

రోడ్డుపై ఉన్న వారంతా ‘‘అయ్యో పాపం! ఈమెకు ఎంత కష్టం వచ్చింది’’.. అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి మహిళలను ప్రభుత్వాలు ఆదుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral News: ఈ మహిళకు వింత కష్టం.. కనీసం బాత్రూంలు కడిగే ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదట.. అసలు కారణమేంటంటే..!

Updated Date - 2023-07-06T19:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising