ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

ABN, First Publish Date - 2023-10-15T17:20:39+05:30

నగరాల్లో ఉరుకుపరుగుల జీవితాలు గడిపే వారంతా ఆటవిడుపు కోసం పండుగలు, శుభకార్యాల సమయంలో సొంతూళ్లకు వెళ్తుంటారు. అలాగే నిత్యం పల్లెలతో మమేకమై ఇప్పటికీ బయటి ప్రపంచం తెలీని చాలా మంది.. అప్పుడప్పుడూ సందర్భానుసారం నగరాల్లో అడుగుపెడుతుంటారు. ఇలాంటి సమయాల్లో...

నగరాల్లో ఉరుకుపరుగుల జీవితాలు గడిపే వారంతా ఆటవిడుపు కోసం పండుగలు, శుభకార్యాల సమయంలో సొంతూళ్లకు వెళ్తుంటారు. అలాగే నిత్యం పల్లెలతో మమేకమై ఇప్పటికీ బయటి ప్రపంచం తెలీని చాలా మంది.. అప్పుడప్పుడూ సందర్భానుసారం నగరాల్లో అడుగుపెడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఏదో వింత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లు ఫీలవుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూ ఉంటాం. ఇక చదువురాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా, ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కారు. అయితే మధ్యలోకి వెళ్లగానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు పల్లెటూరి మహిళలు.. అనుకోకుండా నగరంలో అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎస్కలేటర్ వద్దకు రాగానే అసలు సమస్య మొదలైంది. ఎస్కలేటర్‌ (Escalator) ఎక్కడం తెలీకపోవడంతో.. చాలా సేపు ఆలోచించారు. చివరికి ఏమైతే అదవుతుందిలే అనుకుని ధైర్యం చేసి ఎస్కలేటర్‌పై అడుగుపెట్టారు. మెట్లు పైకి వెళ్తుండడంతో వారి భయం మరింత పెరిగిపోయింది. కాస్తంత ఎత్తుకు (Women fell down while going on the escalator) వెళ్లగానే బ్యాలెన్స్ చేసుకోలేక.. ధమేల్‌మని కిందపడ్డారు.

Accident video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. లేకపోతే.. చూస్తుండగానే ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగరలా..

పక్కన ఉన్న వారంతా చూస్తూ ఉండిపోయారే గానీ.. వారికి ఎవరూ సాయం చేయలేదు. కింద పడ్డ మహిళలు చివరకు ఎలాగోలా లేచి మెట్లపైనే కూర్చున్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, కొందరు కాపాడాల్సింది పోయి.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఎంత అమాయకులు’’.. అని కొందరు, ‘‘సాయం చేయకుండా వీడియో తీయడం దారుణం’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ముద్దుగా ఉన్నాయని కుక్కల సమీపానికి వెళ్తున్నారా.. ఈ యువతి విషయంలో ఏం జరిగిందో చూస్తే షాకవుతారు..

Updated Date - 2023-10-15T17:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising